రాములమ్మకు రాహుల్ గాంధీ భరోసా..!

0

చాలాకాలంగా ఏమైపోయారా.. ఎక్కడికెళ్లిపోయారో కనిపించని విజయశాంతికి ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఇవ్వనుంది. కాంగ్రెస్ లో చేరి చాలా కాలమే అవుతున్నా.. ఇన్నాళ్లుగా ఆమెను కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోలేదు. అయితే.. తాజాగా ఆమెకు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ హోదాను ఇచ్చి గౌరవించింది. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం పార్టీ కమిటీలను ప్రకటించింది. విజయశాంతికి ప్రధాన ప్రచారకర్త హోదాతో పాటు ఎన్నికల ప్రచార కమిటీకి సలహాదారు బాధ్యత అప్పగించింది.

గత నాలుగేళ్లుగా అజ్ఞాతవాసంలో ఉన్న విజయశాంతి మళ్లీ రాజకీయాల్లో చురుకుగా పాల్గొననున్నారు. 2014 ఎన్నికలకి కొద్ది నెల ముందు కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి, ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచీ ఆమె పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మరి మళ్లీ ఆమెను రంగంలోకి దించి, కాంగ్రెస్ ఏ మేరకు సక్సెస్ అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.