చంద్రబాబు సీక్రెట్లను డైరీలో రాసుకున్న శ్రీనివాస్

426

ప్రస్తుతం జరుగుతునన్ ఐటీ రైడ్స్ కారణంగా చంద్రబాబు ఆర్థిక మూలాలు మొత్తం కదిలి పోతున్నాయి. నేరుగా చంద్రబాబు బయటకు రానప్పటికి, అతని ఆర్థిక లావాదేవీలను చూసుకునే బినామీలు మొత్తం ప్రస్తుతం ఐటీ అధికారులకు దొరికిపోయారు. ఆ డబ్బు మొత్తం తనదే అని బయటకు చెప్పుకోలేని పరిస్థితిలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఉన్నట్టు రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

దీనికి తోడు నిన్న మొన్న చంద్రబాబు నాయుడి మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంటి పై జరిగిన దాడుల్లో పలు కీలక పత్రలతో పాటు, ఆర్థిక లావాదేవీలు ఉన్న డైరీ పోలీసులకు దొరికింది. మైండ్లో పెట్టుకోవాల్సిన వివరాలను డైరీలో రాసి పెట్టుకోవడం వల్ల శ్రీనివాస్ తో పాటు పలువురు కీలక నేతలు సైతం దొరికిపోయారు. ఇందులు కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్ తో పాటు దేశవాప్తంగా ఉన్న పులువురు నేతలతో చంద్రబాబుకు ఉన్న ఆర్థిక లావాదేవీలు బయటపడ్డాయి.

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం డబ్బు పంచింది కూడా చంద్రబాబే అనడానికి సాక్ష్యాలు సైతం ఆ డైరీ లో లభించినట్టు నిర్థారణ జరిగింది. మోడీకి వ్య‌తిరేకంగా కాంగ్రెస్‌తో క‌లిసి కూట‌మి క‌ట్టి దేశ స్థాయిలో ఎద‌గాల‌ని ఉర్రూత‌లూగిన బాబు ఆశ‌లు ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత స‌మాధి అయ్యాయి. టీడీపీకి ఆర్థిక స్ధంభాలుగా వ్య‌వ‌హ‌రించిన వారి అక్ర‌మ సంపాద‌న మూలాలు వెలుగుచూస్తున్నాయి. య‌ర‌ప‌తినేని, జేసీ దివాక‌ర్‌రెడ్డి వంటి వారికి గ‌డ్డుకాలం న‌డుస్తోంది. ఇంకోప‌క్క చంద్ర‌బాబు పాల‌న‌లో రాష్ట్ర సంపద‌ను దొచిపెట్టడం వెనుక కార‌ణాల‌పై అధికారుల అన్వేష‌ణ కొన‌సాగుతోంది. ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ వ్య‌వ‌హారం చంద్ర‌బాబు స‌హా మాజీ మంత్రులు, ఇత‌ర టీడీపీ నాయ‌కుల‌ను ఉక్కిరిబిక్క‌రి చేస్తోంది. తెల్ల కార్డుదారుల‌తో వేల ఎక‌రాలు కొనిపించిన వ్య‌వ‌హారాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ లోతుగా ద‌ర్యాప్తు చేస్తోంది. బాబుకి అండ‌గా వ్య‌వ‌హరించిన ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు కృష్ణ కిశోర్‌, ఏబీ వెంక‌టేశ్వ‌ర‌ర్‌రావు వంటి వారు ఆర్థిక అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్టు నిర్ధార‌ణ అవుతోంది.

ఇంత కాలం ఎక్కడా దొరక్కుండా మేనేజ్ చేసిన చంద్రబాబు నాయుడు. శ్రీనివాస్ అనే వ్యక్తి డైరీ ద్వారా బయటపడిపోవడంతో.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాడు .