హైకోర్టుకు టి. కాంగ్రెస్ నేతలు..

43

హైకోర్టుకు టి. కాంగ్రెస్ నేతలు..

కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్, కోమటిరెడ్డి, సంపత్ కుమార్ల సభ్యత్వం రద్దు నేపథ్యంలో టి. కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ మేరకు.. రేపు బుధవారం పిటిషన్ దాఖలు చేయనున్నారు. తమకు న్యాయం చేసే వరకు పోరాటం చేయనున్నట్లు వారు స్పష్టం చేశారు. అయితే సభ్యత్వం రద్దుకు గురైన.. కోమటిరెడ్డి, సంపత్ 48గంటల దీక్షకు దిగనున్నట్లు ప్రకటించారు.

కాంగ్రెస్ నాయకులను దాదాపుగా సస్సెండ్ చేసిన తర్వాత ఇక సభలో ఎందుకు ఉండాలని ఆ పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఎల్సీ సమావేశంలో తీసుకున్న మూకుమ్మడి రాజీనామాల నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతలు ఏఐసీసీకి పంపారు. అక్కడి నుంచి అనుమతి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయనున్నారు.