స్వామిగౌడ్ తో కేసీఆర్ నాటకాలు వేయిస్తున్నారు..! కార్యకర్త లేఖ

87
Telangana Assembly headset on Swamy Goud Komati reddy Venkat Reddy
Telangana Assembly headset on Swamy Goud Komati reddy Venkat Reddy

హెడ్ సెట్ విసరడంపై కార్యకర్త లేఖ!

తెలంగాణ అసెంబ్లీలో జరిగిన హెడ్ సెట్ రచ్చ అందరికీ తెలిసిందే. ఈ విషయంపై అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ కు చెందిన కార్యకర్తలు సైతం చాలా ఘాటుగా స్పందిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒకరు రాసిన లేఖ, సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. జనం మనం పాఠకుల కోసం, ఈ లేఖ ప్రత్యేకంగా..

గవర్నర్ తో గౌరవ స్వామి గౌడ్ గారు కూర్చున్నారు. కోమటిరెడ్డి గారు హెడ్ సెట్ విసిరారు….హెడ్ సెట్ బరువు ఎంత? ఎంత దూరం విసరగలరు? ఒక వేళ విసిరితే తీవ్రత ఎంత? వారు ఎంత దూరం లో కూర్చున్నారు. ? ఒక 100 మీటర్ల దూరం కూర్చున్న వ్యక్తి పైకి రైట్ హాండ్ తో విసరగల వ్యక్తి లెఫ్ట్ హాండ్ తో ఎంత దూరం విసరగలరు ఎవరైనా వీటి అన్నింటిని పరిశీలిస్తే వారు విసిరిన వేగానికి..వారి దూరానికి స్వామిగౌడ్ గారికి తాకుతుందేమో కానీ పెద్ద పెద్ద ప్లాస్టర్స్ వేసుకునేంత దెబ్బ తగలదు.”

Related image
Telangana Assembly headset on Swamy Goud Komati reddy Venkat Reddy

“ఇదంతా రాజకీయ ఎత్తుగడే. ఈ వంకతో కోమటిరెడ్డి ని సభనుండి సస్పెండ్ చేయచ్చనేది తెరాస కుట్ర. మొన్న నల్గొండ లో జరిగిన ఇన్సిడెంట్ మరియు రాష్ట్రంలో జరుగుతున్న దారుణాల్ని అసెంబ్లీలో ఎక్కడ బట్టబయలు చేస్తాడో అని…రాజకీయ కుయుక్తుల కొరకు ఇదొక జిమ్మిక్కు….”

komati reddy headset swamy goud
komati reddy headset swamy goud
SEE ALSO: కోమటి రెడ్డి, సంపత్ ల సభ్యత్వం రద్దు..!

“కోమటిరెడ్డి విసరడం తప్పే. కానీ ఆ తప్పు ఎందుకు జరిగింది. ఒక అంశాన్ని విమర్శించి, ప్రశ్నించే హక్కు సభలో ప్రతీ సభ్యునికి ఉంటుంది. నిరంకుశ విధి విధానాలతో సభను నడిపితే ప్రశ్నిస్తా అంటున్నాడు కోమటిరెడ్డి. ఇదో తప్పా? మరి తగలని దెబ్బకు కట్టుకట్టుకుంటే దాన్ని ఏమనాలి..? టీఆర్ఎస్ వల్ల తగిలిన గాయాలతో చిన్నా భిన్నం అయిన మా జీవితాలను కాపాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా సైనికునిగా వెంట ఉంటాం. ఒక జానా రెడ్డి, ఒక ఉత్తమ్, ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్ఫూర్తితో కదిలే పేద, మధ్య తరగతి,కార్మిక కర్షక జీవనపోరాటం ఇది.”

అంటూ ఒక కాంగ్రెస్ కార్యకర్త రాసిన లేఖ, ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తప్పు ఎవరిది అన్న మీమాంస కంటే, సభలో ఎలాంటి ప్రవర్తన ఉండాలి అన్నదానిపై ఎలాంటి నియమాలు పాటించకపోవడం ప్రజాస్వామ్యాన్ని ఖచ్చితంగా అపహాస్యం చేయడమే. గతంలో సైతం హరీష్ రావు గవర్నర్ పైకి దూసుకెళ్లి దాదాపు కొట్టినంత పనిచేశారు. ఆ సమయంలో తెరాసకు గుర్తురాని ప్రజాస్వామ్యం, అదే దాడి కాంగ్రెస్ పార్టీ చేస్తే గుర్తు వచ్చింది. అలాగే, అప్పట్లో తెరాస అప్రజాస్వామిక విధానాన్ని ఖండించిన కాంగ్రెస్ నాయకులు, నేడు తాము అదే పద్ధతులకు దిగి దాడి చేయడం గమనార్హం. నాయకులు అనేవారు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. చట్టసభల్లో ప్రజాసమస్యల గురించి చర్చించాలి. కానీ మన నాయకులు తీరు మాత్రం ప్రజల్ని కూడా అపహాస్యం చేసేటట్టుగానే కనిపిస్తోంది. దీనిపై ఎటువంటి మార్గదర్శకాలను, పరిణితి చెందిన నాయకులు కూడా అనుసరించకపోవడం దురదృష్టకరం.