సీఎం అయినా.. సామాన్యుడైనా ఒక్కటే.. చంద్రబాబు కు మినహాయింపు లేదు..!

76

ముఖ్యమంత్రి అయినా.. సామాన్యుడు అయినా.. మాకు ఒక్కటే… న్యాయస్థానం ఆదేశాలను పాటించాల్సిందేనని మహారాష్ట్రలోని ధర్మాబాద్ న్యాయస్థానం పేర్కొంది. బాబ్లీ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన కేసు విచారణను న్యాయస్థానం అక్టోబర్ 15కు వాయిదా వేసింది. ఆ రోజు ఏపీ సీఎం చంద్రబాబుతో సహా 16మంది తప్పకుండా న్యాయస్థానానికి హాజరు కావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.

అంతకముందు చంద్రబాబు నాయుడికి జారీచేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ పై కోర్టు విచారణ చేపట్టింది. సీఎం తరపున న్యాయవాది సుబ్బారావు వాదనలు వినిపించారు. కోర్టుకు హాజరయ్యేందుకు గడువు కోరారు. దీంతో నోటీసులు అందుకున్నా.. వారు ఎందుకు హాజరు కాలేదంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. దీంతో సుబ్బారావు స్పందిస్తూ… గుడువు కోరడంతో న్యాస్థానం అక్టోబర్ 15కు విచారణను వాయిదా వేసింది. అలాగే ఇదే కేసులో తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, ప్రకాశ్ గౌడ్, రత్నంకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. వారి ముగ్గురికి రూ.5వేల వంతున జరిమానా విధించింది.