చంద్రబాబు ఎందుకిలా అందరికీ భయపడుతున్నారు..?

140
Why is AP CM chandrababu Naidu is fearing every leader
Why is AP CM chandrababu Naidu is fearing every leader

ఆయన్ను పత్రికాధిపతులు బెదిరిస్తారు. మీడియా ఛానెల్స్ ఛైర్మన్లు కాలర్ పట్టుకుంటారు. పార్టీలో ఎంపీలు మళ్లీ సీటిస్తావా లేదా అని నిలదీస్తారు..చివరికి కొడుకు కూడా అర్హతలు లేకపోయినా నన్ను ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తావా లేదా అని అడిగి సాధించుకుంటాడు. ఎందుకు చంద్రబాబు ఇలా తయారయ్యారు..? స్వతహాగా చంద్రబాబుకు ధైర్యస్థుడు కాదు, మనిషికి తెగింపు ఉండదు. తెరవెనుక వ్యూహాలు, కుట్రలు, భారీ డబ్బు సంచులు వీటిని నమ్ముకునే ఆయన పాలిటిక్స్ నడుపుతారు. మొదట్లో కుల ప్రభావం అంతగా లేకపోయినా, ఆ తర్వాత దాన్ని మెల్లగా వంటబట్టించుకున్నారు. సో, చంద్రబాబు భయాన్ని, ఆయన అవకాశవాదాన్ని ఇప్పుడు ప్రతీ ఒక్కరూ వాడుకుంటున్నారు. ఆయన తీరు అందరికీ లోకువగా మారింది.

ఓటుకు నోటు కేసులో రేవంత్ 50 లక్షలతో అడ్డంగా దొరికిపోయి, చంద్రబాబు వాయిస్ తో సహా అంతా బయటికొచ్చాక, హైదరాబాద్ నుంచే ఏకంగా బెజవాడ పారిపోయారు చంద్రబాబు. పదేళ్లు హైదరాబాద్ లో అన్ని సౌకర్యాలను వినియోగించుకుని, హాయిగా రాజధాని నిర్మించుకుని, ప్రశాంతంగా వెళ్లి ఉండచ్చు. కానీ, కేసీఆర్ తో, టీఆర్ఎస్ తో ఒప్పందం చేసుకుని అమరావతికి షిఫ్ట్ అయిపోయారు. ఆయనొక్కడి వలన, ఉద్యోగులు, వ్యాపారులు, వేల కుటుంబాలు ఇబ్బందుల పాలయ్యాయి.

భార్య, కుమారుడు పెట్టిన ఒత్తిడికి తట్టుకోలేక, అర్హత లేకపోయినా ఎమ్మెల్సీ ఇచ్చి, లోకేష్ ను మంత్రిని చేసి అభాసుపాలయ్యారు బాబు. చంద్రబాబుకు రాజకీయం కావాలి. పదవి కావాలి. అధికారం కావాలి. సీఎం సీటు కావాలి. అది నిలబెట్టుకోవడం కోసం ప్రతీ ఒక్కరికీ భయపడుతూనే వాళ్లకు కావాల్సినవి చేస్తూ నెట్టుకొస్తున్నారు. ఒక సుప్రీం కోర్టు జడ్జి చంద్రబాబును పిలక పట్టుకుని ఆడిస్తున్నాడంటే, ఎంత భయపడుతూ బాబు బ్రతుకుతున్నారో అర్ధమవుతుంది. చివరకు పార్టీ ఎంపీలు రాజ్యసభ సీటు కోసం ఒక పత్రికాధిపతితో కలిసి చంద్రబాబును బెదిరించి అది సాధించుకున్నాడంటే, బాబు దగ్గర ఇప్పుడు ఏ ఫార్ములా వర్కవుట్ అవుతుందో అర్ధమవుతుంది. ఒక్కొక్కసారి ఆశ్చర్యం కూడా కలుగుతుంది. పక్క రాష్ట్ర ప్రభుత్వానికి భయపడతారు, కుటుంబానికి భయపడతారు, కేంద్రానికి భయపడతారు, ఎంపీలకు భయపడతారు, పత్రికాధిపతులకూ భయపడతారు. ఇంతమందిని చూసి భయపడుతూ, ఆ కుర్చీలో కూర్చుని ఏం సాధిస్తాడో ఎవరికీ అర్ధం కాని లాజిక్..!