చంద్రన్న ఏందన్నా… ఇది!

0

ఓ సీనియర్ నాయకుడని ప్రజలు నమ్మి మీకు ఓట్లు వేసింది. మీరు మంచి చేస్తారని.. అప్పటి ప్రస్తుత పరిస్ధితిలో నూతన రాష్ట్రానికి ఓ సమర్ధుడేన నాయకుడని నమ్మి అందరూ ఓట్లు వేశారన్నది మరిచి మీరు ప్రవర్తించడం ఏంబాగొలేదండి.. నిన్న మీరు నాయీ బ్రాహ్మణులతో ప్రవర్తించిన తీరు ఒక్క సారిగా రాష్ట్ర ప్రజలు విస్తు పోయారు.. తమ గోడు వెళ్ళబోసుకుందామని సచివాలయానికి వచ్చిన నాయీబ్రాహ్మణులపై మీరు స్పందించిన తీరు… ఓ సారి ఇలా ఉందండి.. ఏం… పిచ్చి పిచ్చిగా వుందా…? గొంతు చించుకు అరుస్తున్నారు..! ఇలాగౌతే నా స్టైల్ లో నేను మరింత గట్టిగా అరవగలనని…. అరిచి చూపించారు చంద్రబాబు… దీని వెనుక అసలు కారణాలు ఏంటి.. ? బాబు గారు.. మీ పాలనలో అభివృద్ది పథంలో నడుస్తామని.. ఆశించి మరీ గెలిపించిన ప్రజలకు ఇదేనా మీరిచ్చే గౌరవం..

ప్రజలు వారి సమస్యలు పరిష్కరించాలని… ప్రభుత్వాలను, అధికారులను కాక మరి ఇంకెవ్వరిని అడగాలి..? ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగినప్పుడు మీకు గుర్తుకు రాలేదా… మీరు హామీలిచ్చినప్పుడు మీకు మీ పార్టీకి గెలుపు మీద ఉన్న ఆసక్తి… నేడు ప్రజాసమస్యలు తీర్చమంటే ఎందుకు గొంతు లేస్తోంది.. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవడం ఎలా అన్నది మాని ఉన్న కాలం కాస్త… మంచి చేయడానికి చూడండి.. ఇచ్చిన హామీలకు ఏ మేరకు మీరు నిర వేర్చారు.. ఓ సారి మిమ్మల్ని మీరు ప్రశ్నించు కోండి సార్.. నిరుద్యోగ బృతి ఊసే లేదు.. రైతుల రుణమాఫి పై ఇచ్చిన నిధులన్ని.. కులాలుగా కూటములు కూడగట్టి.. హామీల వర్షం ఏమేరకు నిర వేర్చారు.. వాటిమీద మీకు ఎందుకు సార్ కోపం రాదు.. ఎంత సేపు మైకుల ముందు ప్రతి పక్షాన్ని, నాయకులను విమర్శించడానికి ఉన్న శ్రద్ద ప్రజాసమస్యల మీద ఎందుకు దృష్టి లేదు సార్.. సార్ మీకు తెలిసి జరుగుతున్నయో లేక మీ కార్యకర్తలు ప్రభుత్వం పై చురుకుతనం తో అధికారాన్ని తీసుకొని ప్రవర్తిస్తున్న తీరు ఏ గ్రామానికి వాళ్ళి సగటు మనిషిని అడిగి చూడండి… మీ ప్రభుత్వ నిర్వాకం తెలుస్తుంది.. ఇప్పటి దాక భరించారు.. ఇక పై మీకు బి.సి సంఘాల మద్దతు లభించక పోవచ్చు.. ఒక్కోక్కరిగా మీకున్న బీపీ తో అందరిని కోల్పోతున్నారు.. మీ అసహనం మీ నాయకులు, మంత్రులు గుస గుస లాడుతున్నారు.. జర జాగ్రత్త సారు..