ఇదేనా మీ రాజకీయం..

0

ప్రతి నాయకుడు , ఎదుటి వారిని విమర్శించడానికే సమయం సరిపోతోంది. ఇక ప్రజా సమస్యలు ఎక్కడ పట్టించు కుంటారు. రాజకీయ మంటే ఒకరిని మరొకరు తిట్టు కోవడమే వారి దిన చర్య గా మారింది. వీరికి ప్రజల సమస్యలు పట్టవు. వీరికి ఎంత సేపు ఇతర పార్టీల నాయకులను విమర్శించటం మాత్రమే తెలుసు.. వాళ్ళు వీళ్ళని అనటం, వీళ్ళు వాళ్ళని తిట్టం.. అభివృద్ది అంటారోకరు, అదంతా సుద్ద అపద్దం అంటారు మరోకరు..

అసలు ఈ నాయకులు ప్రజలకు చేస్తుంది ఏమిటి..? ఏ ఒక్కనాయకు డైనా ఏనాడైనా తనకు తాను ప్రశ్నించు కున్నాడా.. ? లేదే ఎంత సేపు మా నాయకుడు గొప్ప అంటే కాదు మానాయకుడే గొప్ప అంటూ మీడియా ముందు కు వచ్చి గంటల తరబడి వాదించుకోవడం తప్ప వీళ్ళు ప్రజలకు చేసింది ఏంటి…? ఏ రోజైనా నా ప్రాంత ప్రజలకు ఈ సమస్యలున్నాయి పరిష్కరించండి అని చెప్పారా… లేదే.. విమర్శించు కోవడానికి ఈ నాయకులకు సమయం వుంది కానీ సమస్యలను చెప్పడానికి టైమ్ వుండదు.. అంతెందుకు ఓట్ల ముందు గ్రమ గ్రామాలు తిరిగిన వీళ్ళు ఆతరువాత ఎన్ని సార్లు ఆ గ్రామాల్లో పర్యటించారో ఏ ఓక్క ప్రజా నాయకుడన్నా చెప్పగలడా..?

సార్ మీరు మంచి చేస్తారనే మీకు ప్రజలు వాళ్ళకు తీరిక లేకున్నా పనిగట్టుకొని మరీ పోలింగ్ బూతుకు వచ్చి, లైన్లలో నిలబడి మరీ ఓటు వేసింది మీరు సంపాదించు కోవడానికి కాదు సార్ మిమ్మల్ని ఎన్నకున్నది.. ఏ ఒక్క నాయకుడన్నా మంచి చేయక పోతాడా అనే ఆశతో ఇంకా ఎన్నేళ్ళు ఎదురు చూడాలి సగటు మనిషి.. ఎన్నికలు వచ్చాయంటే మీ పార్టీ కార్యకర్తలకు పండగ… నాలుగు రూ.. లు వెనకేసు కోవచ్చని.. అంతే కానీ ప్రజలకు మీరు చేసింది ఎంటి..?

మీరు నిర్యహించే సభలకు, దీక్షలకు ఖర్చు చేస్తున్న ప్రజాధనాన్ని ఏదో ప్రజలకు ఉపవోగ పడుతున్నట్టు చూపించటం తప్ప ఏంచేస్తున్నారు మీరు.. అయ్యా… మీరు చేస్తున్న పాదయాత్రలకు, రోడ్డు షోలకు మీరు పెడుతున్న ధనం ఎక్కడ నుండి వస్తావుంది.. అసలు మీరు ఖర్చు చేస్తున్న అంత డబ్బు మీకు ఎవరిస్తున్నారు..? కుట్రలు, కుతంత్రాలు, మోసాలు చేయడ మేనా మీ పని.. ఎన్నికల ముందు హామీల వర్షం కురిపిస్తారు.. గెలిచాక ఇచ్చిన హామీలనే మైమరిచి పోతారు… ఇయే మీ రాజకీయాలా…?