కులం పిచ్చి.. కులం పిచ్చి అని చ‌స్తున్నారే.. మా కులంలో పుట్టి చూడండిరా తెలుస్తుంది..!

0

ఎంతో భ‌విష్య‌త్ ఉన్న అభం.. శుభం తెలియ‌ని అమాయ‌కుడ్ని బ‌లి తీసుకున్నారు. ఓ అమ్మాయి జీవితాన్ని దుఃఖంలోకి నెట్టేశారు. కుల‌దుర‌హంకారంతో ర‌గిలిపోయిన అమ్మాయి తండ్రి.. అల్లుడిని దారుణంగా హ‌త్య చేయించాడు. చివ‌ర‌కు జైలుపాల‌య్యాడు. త‌న భ‌ర్త‌ను దారుణంగా హ‌త్య చేయించిన త‌న తండ్రికి ఉరి వేసేలా శిక్ష‌ను అమ‌లు చేయాల‌ని ఆ యువ‌తి కోరుతుంది. ఆ ఆయువ‌తే, మిర్యాల‌గూడ వ‌ద్ద దారుణ హ‌త్య‌కు గురైన ప్ర‌ణ‌య్ స‌తీమ‌ణి అమృత‌.

అయితే, ఇటీవ‌ల కాలంలో ప్ర‌ణయ్ హ‌త్య‌పై సోష‌ల్ మీడియాలో ప‌లు ర‌కాల ట్రోల్స్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఒక‌రు సామాజిక‌వ‌ర్గం గురించి ప్ర‌స్తావించ‌గా, మ‌రొక‌రు దాన్ని ఖండిస్తున్నారు. ఇలా ప్ర‌ణ‌య్ హ‌త్య ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఈ నేప‌థ్యంలో ఇదే విష‌య‌మై ప్ర‌ణ‌య్ త‌మ్ముడు మీడియాతో మాట్లాడుతూ.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. కులం పేరుతో జ‌రుగుతున్న దారుణాల‌పై పోరాటం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నా.

ప్ర‌ణ‌య్ ను అతి దారుణంగా హ‌త్య చేయించిన మారుతీరావును ప్ర‌శ్నించాల్సిన వారు కూడా.. మీ క్యాస్ట్ ఏమిటి..? అంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టులు త‌న‌ను చాలా బాధ‌పెట్టాయ‌న్నారు. పెద్ద పెద్ద సెల‌బ్రెటీలే కులం ప‌ట్టింపులు లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు. అటువంటిది మీకెందుకురా క్యాస్ట్ ఫీలింగ్ అంటూ సోష‌ల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు పెడుతున్న వారిని ప్ర‌శ్నించాడు. మీరు క‌నుక‌.. నా క‌ళ్ల ముందు క‌న‌ప‌డితే కొట్టి చంపేస్తా మిమ్మ‌ల్ని.. మీరు అస‌లు భార‌త‌దేశానికి చెందిన వారు కాదు అంటూ త‌న ఆవేద‌న‌ను మీడియా ముందు వెలిబుచ్చాడు ప్ర‌ణ‌య్ త‌మ్ముడు.