నవ్యాంధ్ర క‌ట్ట‌డాలు.. బాహుబ‌లి సెట్టింగులే.

0

చంద్ర‌బాబు నిర్మిస్తున్న నవ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రాతిని బాహుబ‌లి సెట్టింగుల‌తో పోల్చారు ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైకాపా అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ఈ రోజు అనంతపురం సమర శంఖారావం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగున్న‌రేళ్ల పాల‌న‌పై మండిప‌డుతూ…ఇన్ని రోజులు ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోకుండా విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేసిన బాబు., ఎన్నికలు సమీపిస్తున్న వేళ పెన్ష‌న్ల రూపంలో ఓటుకు రూ. 3 వేలు ఇస్తామ‌ని ప్ర‌జల‌ను మోసం చేస్తున్నార‌న్నారు. 2014 ఎన్నికల్లో ప్ర‌జ‌ల‌కు ఎన్నో హామీల‌నిచ్చిన సీఎం… జాబు రావాలంటే బాబు రావాల‌ని, మూడేళ్ల‌లో పోల‌వ‌రం పూర్తి చేస్తాన‌ని.. ఇలా సినిమా డైలాగులు చెప్పి ప్ర‌జ‌ల‌కు క‌ష్టాల సినిమాను చూపించారన్నారు. చంద్ర‌బాబు పాల‌న‌లో 1250 మందిపై అక్రమ కేసులు పెట్టారని, కొంత‌మందిని సంక్షేమ ప‌థ‌కాల‌కు దూరం చేశార‌ని, మరికొందరిని ఓట‌రు లిస్ట్ నుంచి తొలగిస్తున్నారని ఆయ‌న ఆరోపించారు. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, చంద్రబాబు ఇచ్చే చిల్లర డబ్బులకు లొంగిపోవ‌ద్ద‌ని జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.