హీరోగా విరాట్ కోహ్లీ ఎంట్రీ.. అందుకే ఆసియాకప్ కు దూరమయ్యారా?

0

వెన్నునొప్పితో ఆసియాకప్ కు దూరమైన టీమిండియా కెప్టెన్.. సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారా?… హీరోగా సినీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారా? అసలు విరాట్ కోహ్లీ ట్విట్ వెనుక అర్థం ఏంటి? ఇప్పుడు ఇవే ప్రశ్నలు.. క్రికెట్ అభిమానులను, నెటిజనులను తొలిచివేస్తున్నాయి.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ లో అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆసియాకప్ కు దూరం కావడంతో దొరికిన సమయాన్ని తన కొత్త సినిమా షూటింగ్ కోసం వెచ్చిస్తున్నట్లు తెగ ప్రచారం జరుగుతోంది. విరాట్ కోహ్లీ రీసెంట్ గా చేసిన ఓ ట్వీట్ ఈ ఊహాగానాలకు తెరలేపింది. సెప్టెంబర్ 28న ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు తాజాగా ఓ పోస్టర్ ను ట్వీట్ చేశాడు కోహ్లీ. అందులో తన సొంత బ్రాండ్ Wrogn డ్రెస్ లో హాలీవుడ్ సూపర్ హీరోలా ఫోజ్ ఇచ్చాడు. దానిపై ‘ట్రైలర్ ద మూవీ’ అని ఉంది. దీనిని పోస్ట్ చేస్తూ… ‘పదేళ్ల తర్వాత కొత్తరంగంలోకి ప్రవేశిస్తున్నాను.. అప్పటి వరకు ఆగలేక పో్తున్నాను’. అంటూ ట్వీట్ చేశాడు.

ఇంతకీ ఇది షార్ట్ ఫిల్మ్ కు సంబంధించినదా? లేక విరాట్ కోహ్లీ కొత్త సినిమానా? తన సొంత బ్రాండ్ ప్రమోషన్ లో భాగమా? అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది.