షమీకి అండగా నిలబడుతున్న సహచరులు, క్రికెటర్లు..!

70
Shami gets support from colleagues and ex cricketers
Shami gets support from colleagues and ex cricketers

షమీకి అండగా నిలబడుతున్న….క్రికెటర్లు

తన భార్య చేసిన ఆరోపణల కారణంగా పర్సనల్ లైఫ్ తో పాటు, ప్రొఫెషనల్ లైఫ్ కూడా కోల్పోయే పరిస్థితికి వచ్చేసిన భారత పేస్ బౌలర్ మహ్మద్ షమీకి తన టీమ్ మేట్స్ నుంచి మరికొంతమంది మాజీ సహచరుల నుంచి మద్దతు లభిస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ సైతం షమీకి అండగా నిలిచాడు.

“నాకు తెలిసినంత వరకూ షమీ చాలా మంచి వ్యక్తి. భార్యను, దేశాన్ని మోసం చేసే తత్త్వం అతనికి లేదు. అయితే, ఇది పూర్తిగా అతని పర్సనల్ లైఫ్ కు సంబంధించిన అంశం. కాబట్టి దీనిపై మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. అలా వ్యాఖ్యానించడం తగదు” అన్నాడు ధోనీ. ఇక మరో మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ మాట్లాడుతూ, “భారత క్రికెట్ బోర్డు షమీ కాంట్రాక్టును రద్దు చేయలేదు. కేవలం నిలిపేసిందంతే. దానివల్ల ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. కాంట్రాక్టు అనేది ఆటగాడి సత్తాకు, సామర్ధ్యానికి సంబంధించింది. షమీ బౌలింగ్ సత్తా విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలూ లేవు. పైగా అతన్ని ఏ కోర్టూ దోషిగాన నిర్ధారించలేదు. కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయి. అవి నిజమని తేలితే తప్ప షమీ కెరీర్ కు వచ్చిన ఢోకా ఏమీ లేదు” అన్నాడు.

ఇక క్రికెట్ లెజండ్ కపిల్ దేవ్ అయితే, “షమీ చాలా కష్టపడే తత్త్వం ఉన్న క్రికెటర్. అతనిలాంటి డెడికేషన్ ఉన్న ఆటగాళ్లు, భారత క్రికెట్ కు అత్యవసరం. ఈ గొడవలన్నీ సద్దుమణిగి, షమీ మళ్లీ భారతజట్టులో కనిపిస్తాడని ఆశిస్తున్నా” అన్నాడు.

See Also: గాయని చిన్మయి శ్రీపాద పై లైంగిక దాడి..!