సర్వం సిద్ధం : ఇక నుండి ప్రతి సంవత్సరం చంద్రుడి మీదకు విహార యాత్రలు –

59
mission to moon by nasa to caary humans

ఇక నుండి ప్రతి సంవత్సరం మిస్ కాకుండా చంద్రుడి మీదకు విహారయాత్రలు చేపట్టాలని నాసా భావిస్తుంది . అప్పుడెప్పుడో 1972 లో చంద్రుడి మీదకు మనుషుల్ని పంపిన నాసా ఇప్పటి వరకు ఆ వైపు చూడలేదు . మళ్లీ ఇప్పుడు 2021 లో చంద్రుడి మీదకు మనుషుల్ని పంపడానికి కావాల్సిన ఏర్పాట్లను చేసుకుంటున్నట్టు ప్రకటించింది .

ఎప్పుడు నలభై యాభై సంవత్సరాల తర్వాత కాకుండా.. 2024 లో మనుషుల్ని చంద్రుడి మీద దిగేట్టు చేయాలని నాసా పక్కా ప్లాన్ రెడీ చేసుకుంది. ఈ మిషన్ కు ఆర్ టెమిస్ అనే పేరును పెట్టింది.

నాసా రెడీ చేసిన ప్లాన్ ఇదేనా…

నాసా రెడీ చేసుకున్న ప్లాన్ కు అనుకూలంగా మొదట అంటే 2021 లో మనుషులు లేకుండా వ్యోమనౌక ను చంద్రుడి మీదకు పంపుతారు. ఆ తర్వాత అంటే 2022 లో ట్రైనింగ్ ఇవ్వబడిన వ్యోమగాముల్ని అక్కడకు పంపుతారు . అనంతరం 2024లో మరోసారి మనుషుల్ని అక్కడకు తీసుకు వెళ్తారు. ఇక అది మొదలు ప్రతి సంవత్సరం కొంత మందిని చంద్రుడి మీదకు విహార యాత్రకు తీసుకువెళ్తారు . ఇక ఉమెన్స్ ఫస్ట్ అన్నటు ఈ మిషన్ లో భాగంగా మొదటి అడుగు ఒక మహిల చేత వేయిద్దామని ప్లాన్ చేస్తున్నారు.

ధర ఎంత ? టికెట్ కొనడం ఎలా ?

ఈ యాత్రలు చేపట్టడానికి నాసా 2021 లో $25.2 బిలియన్ డాలర్లు,2022లో $27.2 బిలియన్ డాలర్లు ఇక చివరగా 2023లో $28.6 డాలర్లు ఖర్చు చేయనుంది. అంటే మూడు సంవత్సరాల్లో దాదాపు 77 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనుంది. అయితే పూర్తి స్థాయిలో మనుషుల్ని మాత్రం 2030 లోనే నాసా చంద్రుడి మీదకు తీసుకు వెళ్తుంది. అధికారికంగా నాసా టికెట్ట్ ధర ప్రకటించనప్పటికి.. ఒక్కొక్కరికి కనీసం $50 మిలియన్లు వసూలు చేయనుంది. అయితే భవిష్యత్తులో పెరుగుతున్న రద్దీని బట్టి ధర 2 లక్షల 50 వేల డాలర్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.