2020 దసరా రోజున ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు

77

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు, ఉన్న జిల్లాల విభజన పనులు ఊపందుకున్నాయి. 2020 దసరా నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు కావాలని సీఎం జగన్ ఆదేశించినట్లు సమాచారం. అందుకు తగ్గట్టుగానే పనులు కూడా జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏపీలో 13 జిల్లాలు ఉన్నాయి. మేనిఫెస్టో హామీలో భాగంగా 25 జిల్లాలు కానున్నాయి. ప్రతి లోక్ సభ నియోజకవర్గం ఓ జిల్లా కానుంది.

కొత్త జిల్లాల ఏర్పాటుకు భౌగోళిక విభజన అనేది చాలా ముఖ్యం. ఈ విషయంలోనే అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొత్త డిమాండ్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అయితే వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే మరిన్ని తలనొప్పులు వస్తాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ హామీ ప్రకారం 25 జిల్లాలకే పరిమితం చేయాలని గట్టిగా భావిస్తున్నారు. డిమాండ్లను పరిగణలోకి తీసుకోవటం వల్ల చిన్న రాష్ట్రం తెలంగాణలో 33 జిల్లాలు అయ్యాయి. అలాంటివి ఉత్పన్నం కాకుండా కేవలం 25 మాత్రమే ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కొత్త జిల్లాల ఏర్పాటులో భౌగోళిక స్వరూపంతోపాటు ఆ జిల్లా ఆర్థిక విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. వాటికి అనుగుణంగా చిన్న చిన్న మార్పులు కూడా ఉండొచ్చని చెబుతున్నారు అధికారులు.

ఏదిఏమైనా 2020వ సంవత్సరం దసరా రోజున ఓ పండుగలా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది సీఎం జగన్ సర్కార్.