26న సూర్యగ్రహం.. షష్ట గ్రహ కూటమి కూడా.. సునామీ తేదీ కావటంతో ఆందోళన

79

డిసెంబర్ 26వ తేదీ అందర్నీ భయపెడుతోంది. జాతకాలపై నమ్మకం ఉంచేవారే కాకుండా నాస్తికులు సైతం ఈసారి ఆసక్తి చూపించటం విశేషం. సూర్యగ్రహణాలు కామన్ అయినా.. అది డిసెంబర్ 26వ తేదీన వస్తుండటం ఒకటి అయితే.. అదే రోజు షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది అంట. అంటే ఆరు గ్రహాలు ఒకేరాశిలోకి వస్తున్నాయి. ఒక గ్రహం మారితేనే జాతకాలు తారుమారు అవుతాయి.. అలాంటిది ఆరు గ్రహాలు ఒకేసారి ఒకే రాశిలోకి వస్తుండటంతో ప్రళయమా.. మరేదైనా అద్భుతం జరుగుతుందా అనేది అందరిలో ఆసక్తి రేపుతోంది.

కొన్ని నెలలుగా పండితులు, జ్యోతిష్యశాస్త్ర నిపుణులు షష్ఠగ్రహ కూటమితో వచ్చే విశేషాలు, నష్టాలు, లాభాలు ఏంటో వివరంగా చెబుతున్నారు. జాతకాలను నమ్మని వారు సైతం ఈసారి.. సూర్యగ్రహణం, షష్టగ్రహకూటమిపై ఆసక్తి చూపించటం విశేషం. దీనికి కారణం డిసెంబర్ 26వ తేదీ కావటమే. ఆ తేదీనే గతంలో సునామీ వచ్చింది. ఇప్పుడు కూడా గ్రహాల సంచారం కూడా విభిన్నంగా ఉండటం, సునామీ తేదీ కావటం, అందులోనూ సూర్యగ్రహణం కావటంతో భయాందోళనలతోపాటు అద్భుతాలను ఊహిస్తున్నారు కొందరు.

ఎవరి ఆలోచన ఎలా ఉన్నా.. సూర్యగ్రహణం సందర్భంగా ఆయా రాశుల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం..

డిసెంబర్ 26వ తేదీ గురువారం మూలా నక్షత్రంలో ధనస్సు రాశిలో కేతు గ్రస్త
కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యగ్రహణం ఉదయం 8 గంటల 11 నిమిషాల నుంచి 11 గంటల 20 నిమిషాల వరకు ఉంటుంది.

రాశులపై గ్రహణ ప్రభావం చూద్దాం..
> మేష రాశి : చింత, ఆవేదన, ఉత్సాహం లేకపోవటం
> వృషభ రాశి : సౌఖ్యం పొందుతారు
> మిధునం : స్త్రీ వల్ల కష్టం వచ్చే అవకాశం
> కర్కాటకం : అతికష్టంగా ఉంటుంది మీ జీవితం
> సింహం : మాన నాశనం
> కన్య : సుఖం పొందుతారు
> తుల : లాభం ఉంటుంది
> వృశ్చికం : ఖర్చు వచ్చి పడుతుంది
> ధనస్సు : అనుకోని ఆపదలు రావొచ్చు
> మకరం : ఎవరైనా హాని తలపెట్టే అవకాశం
> కుంభం : ధన లాభం ఉంటుంది.
> మీనం : వ్యధ ఉంటుంది.

గ్రహణం వల్ల ఏర్పడే ఈ చింత శోకాన్ని తప్పించుకోవాలన్నా.. తగ్గించుకోవాలన్నా ఈ పరిహరం చేస్తే సరిపోతుంది అంటున్నారు పండితులు.

బియ్యం 1 1/4 kg, తెల్ల వస్త్రం, వెండి సూర్యబింబము, వెండి సర్పం, రాగి పాత్ర, ఆవు నెయ్యి, గోధుమలు 1 1/4 kg బ్రాహ్మణులకు దానం చేస్తే మంచిది.

మూలా నక్షత్రం ధనుస్సు రాశి వారు గ్రహణం చూడరాదు. గర్భిణీ స్త్రీలు అందరికీ ఇది వర్తిస్తుంది. ఇక 25వ తేదీ రాత్రి 8 గంటలలోపు భోజనాలు ముగించాలి.

అయ్యప్పస్వాములకు ప్రత్యేక సూచన
మీ సన్నిధానాల్లో గ్రహణం కారణంగా 25 వ తేదీ సాయత్రం 7 గంటలకే పూజలు ముగించాలి. రాత్రి 8 గంటలకల్లా అల్పాహారం తీసుకోవాలి. దేవుళ్ల ఫొటోలపై దర్భ వేయాలి. 26వ తేదీ ఉదయం పూజలు ఉండవు. ఉదయం 8 గంటలకు పట్టు స్నానం చేసి జపాలు చేసుకోవాలి. ఉదయం 11 గంటల 20 నిమిషాల తర్వాత మళ్లీ స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకుని పూజ చేయాలి. ఆ తర్వాతే భిక్ష స్వీకరించాలి.

సాధ్యమైనంత వరకు అయ్యప్ప స్వాములు ఉండే అన్ని గ్రూపులకు పంపించండి….