దిశ నిందితుల ఎన్ కౌంటర్ ముందు.. తర్వాత స్పాట్ లో ఏం జరిగిందంటే..

1411

దిశ నిందితులు నలుగురిని కాల్చి చంపారు పోలీసులు. ఎక్కడ అయితే పెట్రోల్ పోసి కాల్చి చంపారో అదే స్పాట్ కు 70 మీటర్ల దూరంలో వారి శవాలు పడి ఉన్నాయి.

ఎన్ కౌంటర్ ముందు – తర్వాత ఏం జరిగింది.

> అర్థరాత్రి 12 గంటల సమయంలో టాస్క్ ఫోర్స్ ఆధీనంలో ఉన్న నిందితులను నిద్రలేపారు
> సీన్ రీకన్ స్ట్రక్షన్ లో భాగంగా ఘటన జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లారు. అప్పుడు సమయంలో అర్థరాత్రి దాటి 2 గంటలు కావస్తుంది.
> జాతీయ రహదారి నుంచి నిందితులను తీసుకుని పోలీసులు బ్రిడ్జి కిందకు వెళ్లారు.
> ఆ రోజు ఏం జరిగింది.. లారీ నుంచి దిశ నుంచి దిశను ఎలా కిందకు దింపారు.. ఎవరు కిరోసిన్ పోశారు.. ఎవరు నిప్పు పెట్టారు అనే విషయాలను వారి నోటి నుంచే చెప్పించారు.
> దిశ మంటల్లో కాలుతుంటే అక్కడి నుంచి వెళ్లిపోయాం అని.. తర్వాత మళ్లీ వచ్చి చూశాం అని చెప్పినట్లు తెలుస్తోంది.
> స్పాట్ నుంచి ఎంత దూరం వెళ్లారు.. మళ్లీ తిరిగి ఎవరెవరు వచ్చారు.. వచ్చిన తర్వాత ఏం చేశారు అనే విషయాలపై రీ కన్ స్ట్రక్షన్ చేశారు.
> అప్పుడు సమయం తెల్లవారుజామున 3.15 గంటలు అవుతుంది.
> అప్పటికే 3 గంటలుగా విచారణ చేస్తున్నారు పోలీసులు. తెల్లవారుజాము కావటం, అప్పటికే తీవ్రమైన చలి ఉండటంతో పోలీసులు కూడా కొంత అలసటకు గురయ్యారు.
> ఈ సమయాన్ని అనుకూలంగా మార్చుకున్నారు నిందితులు.
> తప్పించుకోవాలని భావించి.. బ్రిడ్జి కింద, స్పాట్ లో ఉన్న రాళ్లతో పోలీసులపై దాడి చేశారు. రాళ్లు రువ్వుతూ పారిపోయారు.
> ఊహించని ఘటనతో షాక్ అయ్యారు.
> వెంటనే తేరుకుని వెంబడించారు. పక్కనే ఉన్న వరి పొలాల్లో దాక్కున్నారు.
> లొంగిపోవాలని పదేపదే పోలీసులు కేకలు వేశారు. అయినా పట్టించుకోని నిందితులు.. పొలాల్లో నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించారు.
> చివరి ప్రయత్నంగా పోలీసులు కాల్పులకు దిగారు.
> ఆ తర్వాత వరి పొలాల్లో నుంచి ఎలాంటి చప్పుడు వినిపించలేదు. ఛార్జింగ్ లైట్లతో వెతికారు.
> ఆ నలుగురు చనిపోయి ఉండటాన్ని చూశారు.
> అప్పుడు సమయం తెల్లవారుజామున 3.30 గంటలు.

ఈ విధంగా పోలీస్ తూటాలకు దిశ నిందితులు చనిపోయారు.