ఎన్ కౌంటర్ ముందు రాత్రి బిర్యానీ అడిగిన నిందితులు..

8919

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. అయితే ఈ ఎన్ కౌంటర్ ముందు పోలీసులు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. సీన్ రీకన్ స్ట్రక్షన్ చేయించే ముందు రోజు రాత్రి వారు టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నారు. అర్థరాత్రి తర్వాత బయటకు వెళ్లాల్సి ఉంటుందనే సమాచారం కూడా వారికి ఉంది. కస్టడీలో ఉన్న పోలీసులను నిందితులు బిర్యానీ అడిగారంట.

సార్.. బిర్యానీ పెట్టండి అన్నారంట. బిర్యానీ గిర్యానీ లేదు పెట్టింది తిను అన్నారంట. దీనికి వారు మా ఇంట్లో వాళ్లకు చెబితే తీసుకుని వచ్చి ఇస్తారు అనే సమాధానం వారి నుంచి వచ్చిందంట. దీంతో పోలీసులు అవాక్కయ్యారంట.

వాళ్లు ఏం చేశారు.. దేశవ్యాప్తంగా వాళ్లు చేసిన దురాగతంపై ఎన్ని ఆందోళనలు, నిరసనలు వ్యక్తం అవుతున్నాయో కూడా వారికి తెలియని పరిస్థితి. ఎంత కిరాతకం చేశామనే సోది కూడా వాళ్లలో లేకపోవటం విచిత్రం అంటున్నారు పోలీసులు. బిర్యానీ అడిగారంటే వారి మనస్తత్వం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నలుగురు నిందితుల్లో ముగ్గురి వయస్సు 20 సంవత్సరాలు.. అంత కంటే తక్కువే ఉండొచ్చు. సమాజం అంటే ఏంటీ అనే జ్ణానం కూడా లేకుండా ఉంది.