ఆంధ్ర అంతటా అభివృద్ధి : CRDA రద్దు : అమరావతి రైతులకు భారీ ప్యాకేజీ

223

అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ 29 గ్రామాలతోపాటు టీడీపీ చేస్తున్న ఆందోళనకు షాక్. ఆంధ్రప్రదేశ్ అంతటా అభివృద్ధికి కట్టుబడుతూ మూడు రాజధానులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ కేబినెట్. అమరావతి రైతులకు భారీ ప్యాకేజీ ప్రకటించింది. కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇలా ఉన్నాయి.

> అమరావతిలోనే అసెంబ్లీ ఉంటుంది. సమావేశాలు అన్నీ అమరావతి నుంచే జరుగుతాయి. మూడు సెషన్స్ అక్కడే ఉంటాయి.
> విశాఖపట్నంలో సెక్రటేరియట్ ఉంటుంది.
> అమరావతిని విద్య, వైద్యం హబ్ గా తీర్చిదిద్దుతారు
> అమరావతి కోసం చంద్రబాబు ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతులకు 15 ఏళ్లు కౌలు చెల్లిస్తుంది ప్రభుత్వం
> రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. అమరావతిని అభివృద్ధి చేసి ప్లాట్లను ఇస్తారు
> సీఆర్డీఏ రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం.
> పాలన వికేంద్రీకరణకు అమోదం. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లోని అవసరాలను బట్టి కీలక శాఖలు ఏర్పాటు చేస్తారు
> అమరావతిలో చంద్రబాబు, అతని అనుచరులు కొనుగోలు చేసిన భూములపై ఇన్ సైడర్ ట్రేడింగ్ పై లోకాయుక్త విచారణకు కేబినెట్ అంగీకారం తెలిపింది.
> మూడు ప్రాంతాల అభివృద్ధికి కార్పొరేషన్లు ఏర్పాటు అవుతాయి.
> కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
> విశాఖపట్నంకు సెక్రటేరియట్ తోపాటు HOD కార్యాలయాలు
> పులివెందుల అర్భన్ డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటు