గట్టిగా అనుకుంటే ఐతదిలే : ఏపీలో లిక్కర్ కార్డు మోడల్ ఇదే

130

ఏపీ ప్రభుత్వం మద్యం వినియోగాన్ని కంట్రోల్ చేస్తోంది. అందులో భాగంగా తాగుబోతులను కూడా తగ్గించాలని గట్టిగా అనుకుంటోంది. ఈ క్రమంలోనే మందుబాబులకు కార్డులు జారీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంది ఎంత వరకు నిజమో కానీ.. ఓ కార్డు అందరి దృష్టని ఆకర్షిస్తోంది. ఏటీఎం కార్డు కంటే చాలా బాగుందనే టాక్ వచ్చింది.

కార్డు నలుపు రంగులో ఉంది. లిక్కర్ కార్డు అని రాసి ఉంటుంది. ఎడమ వైపు పైన ఆంద్రప్రదేశ్ సింబల్ ఉంది. మధ్య ఆల్కాహాల్ ఆరోగ్యానికి హానికరం అని రాసి ఉంది. కింద అయితే నెంబర్ ఉంది. కార్డు చెల్లుబాటు సంవత్సరం, తేదీ కూడా వేశారు. ఈ కింద ఓ పేరు ఉంది. ఆ పక్కనే మీ సంతకం ఉంటుంది.

ఈ కార్డును మందుగా రీఛార్జ్ చేసుకోవాలి. నెలకు మూడు వేల రూపాయలు మాత్రమే అనుమతి ఉంటుంది. అంతకు మించి పోయరు. ఈ కార్డును ఏపీ రాష్ట్రంలోని అన్ని వైన్, బార్లు, పబ్స్ లో వాడుకోవచ్చు. భవిష్యత్ లో క్యాష్ లెస్ లిక్కర్ సేల్స్ దిశగా అడుగులు వేయటం ద్వారా వినియోగాన్ని భారీ తగ్గించాలనే ఆలోచనతోనే ఈ సిస్టమ్ తీసుకొస్తున్నట్లు సమాచారం. దీని వల్ల బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలకు విక్రయించటం, అర్థరాత్రులు అమ్మకాలు పూర్తిగా పోతాయనేది కొందరి వాదన.

అసలు ఈ కార్డు అనేది కొందరి సృష్టి అని.. ప్రభుత్వం దగ్గర అలాంటి ఆలోచన లేదనేది కూడా మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఏపీ లిక్కర్ కార్డు అంటూ సోషల్ మీడియాలో మాత్రం బీభత్సంగా తిరిగేస్తోంది..