ప్రచార కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి ఆఖిల ప్రియ

53
bhuma akilka priya.
bhuma akilka priya.

కర్నూలు, ఆళ్ళగడ్డ గత ఎన్నికల్లో ఆళ్ళగడ్డ నియోజక వర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచి ప్రచారకార్యక్రమాలు ముగించుకోని ఇంటికి వస్తుండగా ప్రమాదవశాత్తు భూమా శోభా నాగిరెడ్డి మృతి చెందడంతో, భూమా అఖిల ప్రియ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీడీపీ అధిష్టానం ఇప్పటికే అఖిల ప్రియను ఆళ్ళగడ్డ నియోజక వర్గం అభ్యర్థిగా ప్రకటించడంతో, ఆమె ప్రచార కార్యక్రమం ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఆమె నియోజకవర్గ పరిదిలోని చాగలమర్రి మండలంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు . ప్రచార కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి టీడీపీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా అఖిల ప్రియా మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది తను కాదని తన తల్లి శోభా నాగిరెడ్డి అని, తల్లిని గెలిపించు కోవడానికి, ఆశయాలను నెరవేర్చడానికి కష్టపడుతున్నామని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఆళ్ళగడ్డ నియోజక వర్గంలో తమదే గెలుపన్న ధీమాను ఆమె వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు, భూమా కుటుంబ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.