వైసీపీలో చేరుతున్నార‌నే వార్త‌ల్ని ఖండించిన పితాని

28
ap tdp minister pithani satyanarayana.
ap tdp minister pithani satyanarayana.

తాను పార్టీ మారుతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ ఖండించారు. కొన్ని మీడియా సంస్థ‌లు త‌న‌పై దుష్ప్ర‌చారానికి పాల్ప‌డుతున్నాయ‌ని ఆరోపించారు. తాను వ్య‌క్తిగ‌త అవ‌స‌రంపై హైద‌రాబాద్ కు వెళితే..మీడియా ఛానెళ్లు ప‌నిగ‌ట్టుకొని అస‌త్య‌ప్ర‌చారం చేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. పత్రికలో వచ్చిన ఈ వార్తను చూసి, సీఎం తనను పిలిచారని, తాను కచ్చితంగా పార్టీ మారనని సీఎంకు వివరించినట్లు పితాని తెలిపారు.

 తొమ్మిది నెలలుగా తనపై ఇలాంటి దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. వ్యక్తిగతంగా ఎవరికీ నష్టం కలిగించొద్దనే మీడియా ముందుకు వచ్చానని చెప్పారు. ‘‘నేను హైదరాబాద్‌, దిల్లీ వెళ్తే తప్పేంటి? హైదరాబాద్‌ వెళ్లినంత మాత్రాన పార్టీ మారినట్లా?’’ అని ప్రశ్నించారు. ఇటువంటి వార్తలపై కొందరు పాత్రికేయ మిత్రులు తనకు నేరుగా ఫోన్‌ చేసి అడిగినందుకు వారిని అభినందిస్తున్నాన‌ని తెలిపారు.