చంద్రబాబు పిలుపుకోసం ఎదురుచూస్తున్న “బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి”

119
ap elactions, baireddy rajasekhar reddy.
ap elactions, baireddy rajasekhar reddy.

రాయలసీమ రాజకీయాలలో ఒక వెలుగు వెలిగిన నాయకుడు, రాయలసీమ పరిరక్షణ సమితి ఉద్యమ కర్త బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్దమైనట్లు తెలుస్తుంది. పార్టీ అధినేత చంద్రబాబు నుంచి పిలుపు కోసం వేచిచూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించిన రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో టీడీపీకి గుడ్‌బై చెప్పేసి ఉద్యమ నేత అవతారం ఎత్తారు.

వెనుకబడిన రాయలసీమ కోసం తమ ప్రాంత ప్రజల హక్కుల కోసం ‘రాయలసీమ పరిరక్షణ సమితి’ పేరుతో సొంత ఉద్యమ పార్టీని ఏర్పాటుచేసుకుని ఆందోళనలు నిర్వహిస్తూ ప్రజల్ని చైతన్య పరిచారు. కొద్ది రోజుల తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో విభేదాలు రావడంతో కాంగ్రెస్‌ కు గుడ్ భై చెప్పేసారు. అయితే ఇప్పుడు సొంత పార్టీలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నారు.

కర్నూలు జిల్లాలోని శ్రీశైలం స్థానం నుంచి పార్టీ టికెట్టు కేటాయించిన బుడ్డా రాజశేఖరరెడ్డి అక్కడినుంచి పోటీకి ఇష్టపడకపోవడంతో, మరో అభ్యర్థికోసం టీడీపీ వెతుకులాట ప్రారంభించింది. ఈ నేపథ్యంలో నందికొట్కూరు నియోజకవర్గం నుంచి 1994, 1999 లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన బైరెడ్డి పార్టీలో చేరితే ఆయనను శ్రీశైలం స్థానం నుంచి పోటీ చేయించాలని టీడీపీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.