ముదురుతున్న శ్రీకాళహస్తి టీడీపీ వివాదం

44
ap, telugudesham party.
ap, telugudesham party.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజక వర్గం టీడీపీ టికెట్ వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. గతంలో ఈ నియోజక వర్గం నుంచి బోజ్జల గోపాలకృష్ణ రెడ్డి సీనియర్ నాయకుడిగా ఎన్నికల బరిలో నిలిచేవారు. కాగా ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో టీడీపీలో ఎన్నో యేళ్లుగా పనిచేస్తున్న సీనియర్ నాయకులు ఇప్పుడు తమకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధిస్టానంతో మంతనాలు జరుపుతున్నారు.

ఈ నేపధ్యంలో బొజ్జల వారసుడు సుదీర్ రెడ్డికి టికెట్ ఇచ్చే సూచనలు కనిపించడంతో ఎస్ సీ వీ నాయుడు తమ అనుచర వర్గం టీడీపీ పార్టీ, తమకు టికెట్ ఇవ్వని పక్షంలో పార్టీకి గుడ్ బై చెబుతామని అధిష్టానం కు హెచ్చరికలు జారీ చేశారు. బొజ్జల కుటుంబానికి టికెట్ ఇస్తే మాత్రం, శ్రీకాళహస్తిలో టీడీపీ విజయం, నల్లేరు మీద నడకేనని సీనియర్లు చెబుతున్న మాట. నాయుడు పార్టీ వీడితే శ్రీకాళహస్తితో పాటు మరో నాలుగు నియోజక వర్గాల్లో టీడీపీ తన పట్టు కోల్పోయినట్లే.. మొత్తానికి చంద్రబాబుకు తన సొంత జిల్లాలోనే పెద్ద చిక్కు వచ్చి పడింది.

సి వీ నాయుడు పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరనున్నట్లు వార్తలు కూడా ప్రస్తుతం గట్టిగానే వినిపిస్తున్నాయి. మరి ఇదే జరిగితే చిత్తూరు జిల్లాలో వైసీపీ నాయకులు గట్టి పోటీ ఇవ్వనున్నట్లే అని చెప్పవచ్చు. మరి ఈ వివాదంపై పూర్తి వివరాలు తెలియాలంటే మరో రెండు మూడు రోజులు ఆగాల్సి ఉంది. ఎస్ సీ వీ నాయుడు అనుచర వర్గం, తమ నాయకుడికి టికెట్ ఇవ్వకుంటే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తామని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తూ పలు సమావేశాలు నిర్వహిస్తున్నారు.