‘నేను విన్నాను.. నేను ఉన్నాను’

51
jagan mohan reddy public meet
jagan mohan reddy public meet

వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సినిమా డైలాగ్‌ను అచ్చుగుద్దినట్టు దించేశారు.తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’ సినిమాలో డైలాగ్‌ను బహిరంగసభలో చెప్పడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. యాత్ర సినిమాలో ‘నేను విన్నాను… నేను ఉన్నాను’ అనే డైలాగ్ బాగా పాపులర్ అయింది.

ప్రజల కష్టాలను చూసి చెప్పే ఆ డైలాగ్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దీంతో నర్సీపట్నంలో జరిగిన ఎన్నికల సభలో యాత్ర సినిమాలో ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ డైలాగ్‌ను చెప్పారు. ప్రజాసంకల్ప యాత్రలో ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా తెలుసుకున్నానని.. వారి ఆవేదన తాను విన్నానని… వారికి తాను అండగా ఉంటానని జగన్ ప్రకటించారు.