విశాఖలో జగన్ నివాసం ఫైనల్ అయినట్టే…

161

ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించి,అక్కడ నుండే పాలనను సాగించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దానికి తగినట్టే వ్యవాస్థాగతమైన మార్పులన్ని ఇప్పటికే జరిగిపోయాయి. చాలా వరకు ఉద్యోగులు సైతం ఇప్పటికే అక్కడికి సైలెంట్ గా తరలి వెళ్లిపోయారు. ఇక మిగిలింది ముఖ్యమంత్రి అక్కడకు వెళ్ళిపోవడమే.

ఇంత కాలం ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఉండటానికి అనువైన ప్రదేశం కోసం అన్వేషించిన అధికారులు ఎట్టకేలకు పోర్టు ట్రస్ట్ కు చెందిన ఒక గెస్ట్ హౌస్ ను ఫైనల్ చేశారు.విశాఖలో సిరిపురం కూడలికి, బీచ్ కు సమీపంలో ఈ అతిది గృహం ఉంటుంది. అత్యంత విశాలంగా ఉండే ఈ అతిథిగృహం భద్రతపరంగా కూడా అన్ని విధాలు సరిపోతుందని అధికారులు సీఎంవో రిపోర్ట్ సైతం పంపించేశారు. ఒక్కసారి ఈ భవనంలో ఉండటానికి జగన్ రైట్ కొడితే.. మరో వారం పది రోజుల్లో విశాఖలో ముఖ్యమంత్రి నివాసం ఫైనల్ అయినట్టే.. ఇక నుండి సీఎం జగన్ ను కలవాలంటే ఎవరైన వైజాగ్ లోని సిరిపురం గెస్ట్ హౌస్ కు వెళ్ళాల్సిందే.