లోటస్ పాండ్ లో టికెట్ వ్యాపారం చేస్తున్నారు : గోనుగుంట్ల

30
gonuguntla koteswara rao.
gonuguntla koteswara rao.

గుంటూరు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో, రాష్ట్ర దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు, ప్రతిపక్ష నేత జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలను చూసి వైయస్ జగన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి లోటస్ పాండ్ లో కూర్చొని టికెట్లు వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో వైసీపీ కనుమరుగు కావడం ఖాయమని ఆయన జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, దివ్యాంగుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.