మీడియా మేనేజ్ మెంట్ లో చంద్రబాబు చతికిలపడ్డారా.. జర్నలిస్టులే పార్టీని నడిపించే స్థాయికి దిగజారిందా టీడీపీ!

111
chandrababu naidu media strategy

మీడియా మేనేజ్ మెంట్ అంటే చంద్రబాబునాయుడుదే.. ఆయన అందర్నీ మేనేజ్ చేస్తారు.. ఆయన మాటే హెడ్ లైన్.. ఆయన కాలుకదిపితే ప్రపంచదేశాలు కదులుతాయి.. ఐటీ పితామహుడు.. ఇదీ నిన్నటి వరకు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కథనాలు. వాస్తవమే. ఇదంతా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వరకే. ఇప్పుడు ట్రెండ్ మారింది. సోషల్ మీడియా వచ్చేసింది. వ్యూహాలు మారాయి.. జనం చేతిలోకి మీడియా వచ్చేసింది.

ఈ విషయంలోనే చంద్రబాబు చతికలపడ్డారు. 20 ఏళ్ల నాటి ప్రింట్ మీడియా వ్యూహాలనే ఇప్పటికే అమలు చేస్తున్నారనేది ఏపీ అసెంబ్లీ సాక్షిగా బయటపడింది. ఇప్పుడు ఈ రెండు మీడియా సంస్థల జర్నలిస్టులు తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్నారు. సభలో మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సామాన్యుల్లోనూ చర్చనీయాంశం అయ్యాయి. టీడీపీ నేతలు, కార్యకర్తల్లోనే అసహనానికి గురి చేస్తున్నాయి.
రైతు బజార్ లో చనిపోయిన వ్యక్తిని.. ఉల్లి రాజకీయం కోసం వాడుకోవాలని ఈనాడు, ఆంద్రజ్యోతి జర్నలిస్టులు వేసిన శవ రాజకీయం ప్లాన్ ఉల్టా అయ్యింది. టీడీపీకే కన్నీళ్లు తెప్పించింది. పార్టీ పరువును మరోసారి తీసింది. అసలు మీడియానే మేనేజ్ చేసే కెపాసిటీ ఉన్న చంద్రబాబు.. జర్నలిస్టుల చేతిలో పార్టీ విధానాలను పెట్టటం ఏంటని స్వయంగా పార్టీ నేతలే బహిరంగంగా విమర్శలు చేసే స్థాయి వచ్చారు.
మొన్నటికి మొన్న వల్లభనేని వంశీ విషయంలోనూ జర్నలిస్టులు చేసిన పనికి చంద్రబాబు ఇమేజ్ ఘోరంగా దెబ్బతిన్నది. ఆ తర్వాత ఇసుక రాజకీయం అంతే. ఇప్పుడు ఉల్లి శవ రాజకీయం. ప్రతి విషయంలోనూ ఆర్భాటం చేస్తున్న జర్నలిస్టుులు.. మనం చేస్తున్న పని పార్టీకి ఎంత నష్టం చేస్తుందో అర్థం చేసుకోవటం లేదు.

సోషల్ మీడియా స్ట్రాటజీ అంటే ఏంటో కూడా తెలియకుండా గుడ్డిగా.. 20 ఏళ్ల నాటి సిద్ధాంతాలనే ఫాలో అవుతున్నారు. వాళ్లను నమ్మి అడ్డంగా బుక్ అవుతున్నారు చంద్రబాబునాయుడు. చివరికి అసెంబ్లీలోనే మీ పాంప్లీట్ పత్రిక ఈనాడులో కూడా యాడ్ ఇస్తాను చూసుకో అని సీఎం జగన్ అన్నారు అంటే.. ఏ రేంజ్ లో ఆ పత్రికలు టీడీపీకి కొమ్ముకాస్తున్నాయో సామాన్యులకు అర్థం అవుతుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఆ రెండు పత్రికలు రాస్తే నిజం అని నమ్మే రోజులు ఎక్కడున్నాయ్..

చంద్రబాబుగారూ.. ఇప్పటికైనా మీ మేనేజ్ మెంట్ చూపించండి.. మిమ్మల్ని మేనేజ్ చేసి మీడియాలోకి వెళ్లకండి. ఎందుకంటే టీడీపీ అనేది పార్టీ..