ఎంపీలు మెగా బ్రదర్స్ : వైసీపీ నుంచి చిరంజీవి, బీజేపీ నుంచి పవన్

880

రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. ఏపీలో ఇప్పుడు అదే జరుగుతుంది. మెగా బ్రదర్స్ ఫ్యామిలీ నుంచి రాజకీయం జరుగుతుంది. వైఎస్ జగన్ కు దగ్గరగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవిని సరైన రీతిలో గౌరవించాలని నిర్ణయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో చిరంజీవిని రాజ్యసభకు పంపించాలని నిర్ణయించింది. అదీ కాకపోతే రాష్ట్రపతి కోటా కింద రాజ్యసభకు ఎంపిక చేయాలనిని సిఫార్స్ చేయబోతున్నట్లు సమాచారం. దాసరి నారాయణరావు తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆ స్థాయిలో పెద్దదిక్కుగా, మోస్ట్ సీనియర్ గా ఉంటున్న చిరంజీవికి ఇది సరైన గౌరవం అని భావిస్తున్నారు.

ఇదే సమయంలో తమ్ముడి పవన్ కల్యాణ్ ను తనవైపు తిప్పుకున్న బీజేపీ కూడా అదే తరహాలో మంచి స్థాయితో గుర్తింపు ఇవ్వాలని చూస్తోంది. రాజ్యసభకు పంపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేవలం ఒక్క శాతం ఓట్లు ఉన్న బీజేపీకి.. 6శాతం ఓట్లు ఉన్న జనసేన బేషరతు మద్దతు ఇవ్వటానికి ప్రతిఫలంగా రాజ్యసభకు పంపిచాలని డిసైడ్ అయ్యారంట. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసినందుకు కృతజ్ణతగా కాంగ్రెస్ రాజ్యసభతోపాటు కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది. అయితే ఇప్పుడు జనసేనకు ఓట్ల శాతం తప్పితే.. ఎమ్మెల్యేలు, ఎంపీలు లేరు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 6శాతం ఓట్లకు మద్దతుగా రాజ్యసభ ఎంపీని చేస్తామని హామీ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

ఏప్రిల్ – మే నెలలో మెగా బ్రదర్స్ ఇద్దరూ రాజ్యసభకు వెళ్లే అవకాశాలు మొండుగా కనిపిస్తున్నాయి. తెలుగు సినీ ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటుందని.. గౌరవం, గుర్తింపు ఇస్తుంది అని చెప్పుకోవటానికి చిరంజీవికి పదవి ఇవ్వటం ఒక్కటే పరిష్కారంగా కనిపిస్తుంది.