అమరావతి మారుస్తాను అని నేను చెప్పానా.. ఆ మంత్రులతో సీఎం జగన్

560

కేబినెట్ భేటీ తర్వాత సెక్రటేరియట్ లో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగిందంట. ఓ ఇద్దరు మంత్రులు సీఎం జగన్ దగ్గరకు వెళ్లి.. అమరావతిని పూర్తిగా మార్చేస్తారా అని నేరుగా ప్రశ్నించినట్లు సమాచారం. ఈ సమయంలో జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశం అయ్యాయి. అమరావతిని మార్చేస్తాను.. ఎత్తేస్తాను అని మీకు చెప్పానా అంటూ వారితో నేరుగా ప్రశ్నించారంట. ఏం జరుగుతుందో చూద్దాం.. కేబినెట్ చర్చించిన అంశాలతోపాటు మీ వ్యక్తిగత అభిప్రాయాలను కూడా సూటిగా, సుత్తి లేకుండా, కుండ బద్దలు కొట్టినట్లు చెప్పండి. 15 రోజుల్లో మీ వ్యక్తి అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి అన్నారంట.

రైతుల ఆందోళన అంశాన్ని ప్రస్తావించారంట.. తిట్టేటోళ్లను ఏం చేయగలం.. వీళ్లే రేపు ఎలా మాట్లాడతారో కూడా చూద్దాం అంటూ టాపిక్ కట్ చేసినట్లు వైసీపీ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 15 రోజుల్లో ఏదో జరగబోతున్నది.. అది సంక్రాంతి పండక్కి ముందా తర్వాత అనేది మాత్రం క్లారిటీ రాకపోయినా.. అమరావతిపై పాజిటివ్ డెసిషన్ అయితే వస్తుందనే అనుకుంటున్నారు.

అమరావతిని మారుస్తాను అని నేను చెప్పానా అని సీఎం జగన్ అన్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కూడా భిన్న కథనాలు వినిపించటం విశేషం.