సీఎం జగన్ కొంచెం లావయ్యారు..

154
ap cm ys jagan becomes some fat

సీఎం పదవిలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయ్యింది. సంక్షేమ పథకాల్లో బెస్ట్ గా నిలుస్తున్న ఏపీ సీఎం జగన్.. అవినీతిని కంట్రోల్ చేయటంలోనూ అదే స్థాయిలో విజయం సాధించారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఓదార్పు యాత్ర, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాసంకల్ప యాత్ర పేరుతో జనంలోనే ఉన్నారు. రోడ్లపైనే తిరిగారు. ఎండా వాన లెక్కచేయకుండా ప్రజల్లోనే ఉన్నారు. అన్ని రోజులు అలా తిరిగినా ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునే వారు. ఎప్పుడూ ఒకేలా ఉండేవారు. ఒకేలా కనిపించేవారు.

అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకు మాత్రం సీఎం జగన్ లో మార్పు కనిపించింది. సీఎం జగన్ కొంచెం లావయ్యాడు.. అనే కామెంట్ వినిపించటం విశేషం. అప్పుడు – ఇప్పుడు బాగా చూసినోళ్లకు మాత్రం ఈ తేడా కనిపిస్తోంది. ఇంట్లో అమ్ముమ్మ, నానమ్మలు అంటుంటారు.. ఏంటిరా చిక్కిపోయావ్ అని.. కొంచెం లావయ్యావు అంటుంటారు కదా.. అలాగే ఇప్పుడు జగన్ కొంచెం లావయ్యాడు అనే టాక్ వినిపిస్తుంది.

బరువు ఎంత పెరిగారో తెలియదు కానీ.. లావయ్యారా లేదా అనే మాత్రం సీఎం జగనే చెప్పాలి. ఇటీవల కాలంలో పబ్లిక్ మీటింగ్స్ చూసినోళ్లకు ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అంతేలే అండీ ఆనందమే సగం బలం అంటారు.. అలాంటి ఫుల్ ఆనందం ఉంటే ఆ మాత్రం లావు కారా ఏంటీ అంటున్నారు పెద్దలు..