బుద్దిమంతులయ్యారు : దిశ ఘటన తర్వాత మాల్స్ ఖాళీ, డేటింగ్ సైట్స్ ఢమాల్

1249
disha case

దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. పార్లమెంట్ ను సైతం కుదిపేస్తోంది. ఈ ఘటన తర్వాత హైదరాబాద్ అబ్బాయిలు బాగా అలర్ట్ అయ్యారు. లవర్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నారు. గతంలో ఎప్పుడుపడితే అప్పుడు మాట్లాడుకోవటం, చాటింగ్స్, డేటింగ్స్, సినిమాలు, షికార్లు అంటూ చక్కర్లు కొట్టేవారు. ఇప్పుడు సీన్ మారింది. వారం రోజులుగా అబ్బాయిలు సైలెంట్ అయ్యారు. సెల్ ఫోన్లలో చాటింగ్స్ తగ్గించేశారంట. ఫోన్స్ లో సొల్లు కబుర్లు తగ్గించేశారంట. ముందు జాగ్రత్త చర్యలు బాగా చేపట్టారంట.

మాల్స్ ఖాళీ : లవర్స్ లేక బోసిపోతున్నాయి

దిశ ఘటన తర్వాత మాల్స్ లో హడావిడి, హల్ చల్ చేసే జంట సంఖ్య భారీగా తగ్గిపోయిందంట. గతంలో వీక్ డేస్ లో సైతం ఒక్కో మాల్ కు కనీసం 200 జంటలు వచ్చేవంట. ఇప్పుడు ఆ సంఖ్య 100కి కూడా మించటం లేదంట. ఫుడ్ కోర్టుల్లోనూ సందడి తగ్గింది. బిజినెస్ కూడా బాగా పడిపోయిందంట. ఎందుకొచ్చిన గొడవ.. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎటొచ్చి ఇరికిస్తుందో అనే భయంతో దూరంగా ఉంటున్నారంట అబ్బాయిలు. అసలే పబ్లిక్ హీట్ లో ఉంది.. ఈ టైంలో ఏదైనా ఇష్యూ వస్తే అసలుకే మోసం వస్తుంది అనే భయం వెంటాడుతుందంట. దీంతో మాల్స్ లో షికార్లు చేసే జంట సంఖ్య బీభత్సంగా తగ్గిపోవటం విశేషం.

డేటింగ్ సైట్స్ ఢమాల్ :

హైదరాబాద్ లో డేటింగ్ సైట్స్ బిజినెస్ 10 కాల్స్ 3 బుకింగ్స్ గా హ్యాపీగా సాగుతుంది. ఇప్పుడు సీన్ మారిపోయింది. కాల్స్ సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందంట. పోలీసుల హడావిడి పెరగటం, పబ్లిక్ కూడా బాగా ఆగ్రహావేశాల్లో ఉండటంతో డేటింగ్ సైట్స్ జోలికి వెళ్లటం లేదంట. ఎందుకొచ్చిన రిస్క్ బాస్.. కొన్నాళ్లు బుద్దిగా ఉంటేపోలా అని సర్దిచెప్పుకుంటున్నారంట.మొన్నటికి మొన్న మాజీ ఎమ్మెల్యే కుమారుడు పబ్ లో రచ్చ చేయటం, ఆ సినిమా అమ్మాయి కంప్లయింట్.. నిర్భయ కింద కేసు బుక్ చేయటం ఇవన్నీ కూడా బాగా ఎఫెక్ట్ పడ్డాయని ఓ డేటింగ్ సైట్ నిర్వాహకుడు చెప్పుకొచ్చాడు. ఓ నెల రోజులుపోతేకానీ పరిస్థితులు చక్కబడవని అప్పటి వరకు ఇదే పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. సో.. ఈ నెల రోజులు హైదరాబాద్ కుర్రోళ్లు బుద్దిమంతులే అన్నమాట….