నిర్భయ నిందితుల వాదన : మమ్మల్ని ఢిల్లీ పొల్యూషన్ చంపేస్తుంది.. ఉరిశిక్ష ఎందుకు

179

వీళ్లు మాములోళ్లు కాదు. నిర్భయ నిందితుల వాదన విని సుప్రీంకోర్టు షాక్ అయ్యింది. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించిన తర్వాత కోర్టుకు వెళ్లారు. ఇందులో ఠాకూర్ అనే నిందితుడు తన వాదనను విచిత్రంగా వాదించాడు. ఢిల్లీలో గాలి, నీరు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందన్నాడు. జీవిత కాలం తగ్గిపోయిందంటూ చెప్పుకొచ్చాడు. ఇంక ఉరి శిక్ష విధించటం ఎందుకు అని ప్రశ్నించాడు. శిక్షను సమీక్షించాలని కోరుతూ ఈ వాదన చేశాడు అక్షయ్ సింగ్ ఠాకూర్.

అంతేకాదు వీడు మరో వాదన కూడా తన పిటీషన్ ద్వారా సుప్రీంకోర్టుకు దృష్టికి తీసుకొచ్చాడు. హిందూ పురాణాలను ప్రస్తావించాడు. భారతీయ వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులకు మూలం అయిన సత్యగ్ లో ఇలా రాసి ఉంది. అప్పట్లో వెయ్యి సంవత్సరాలు జీవించేవారని రాశారు. ఇప్పుడు నాలుగో కలియుగం నడుస్తోంది. ఇక్కడ జీవిత కాలం 50-60 సంవత్సరాలు మాత్రమే. జీవితకాలమే 50-60 సంవత్సరాలకు పడిపోయింది.. దీనికితోడు ఢిల్లీ కాలుష్యం వల్ల మరింత త్వరగా చనిపోతున్నాం.. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని జీవితకాల శిక్షగా మార్చాలని కోరాడు ఠాకూర్.

ఈ పిటీషన్ పై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఇది చాలా అరుదైన కేసు అని అభిప్రాయపడింది. ఎలాంటి పిటీషన్లను విచారించటానికి వీల్లేదని వ్యాఖ్యలు చేసింది. కేసులో తుది తీర్పు ఇప్పటికే ఇవ్వటం జరిగిందని.. మళ్లీ సమీక్షించే అవకాశం లేదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో.. ఉరిశిక్ష అమలు ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే తాళ్లను సిద్ధం చేసిన తీహార్ జైలు అధికారులు.. అమలు చేయటం మాత్రమే మిగిలి ఉంది. తేదీ ఎప్పుడు అనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.