లగడపాటి నువ్వు ఉన్నావయ్యా : మెట్రో రైళ్లలో పెప్పర్ స్ప్రేలు

133
delhi metro allows pepper spray into metro in delhi

నిర్భయ, దిశ.. ఏడేళ్లలో దేశం మొత్తాన్ని కదిలించిన ఘటనలు. మహిళా లోకాన్ని ఏకంగా చేశాయి. భద్రత, రక్షణపై ముందడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగానే అత్యంత భద్రత మధ్య జరిగే రవాణా వ్యవస్థ అయిన మెట్రోలో.. మహిళల రక్షణ కోసం వెసలుబాట్లు కల్పించారు అధికారులు. ఇక నుంచి మెట్రో రైల్లే ప్రయాణించే మహిళలు తమ వెంట పెప్పర్ స్ప్రే తీసుకెళ్లటానికి మెట్రో అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాస్తవంగా అయితే గుండుసూది కూడా అనుమతి ఇవ్వరు. చిన్న చాకు కూడా తీసుకెళ్లటానికి వీల్లేదు. ఇప్పుడు ఏకంగా పెప్పర్ స్ప్రే తీసుకెళ్లొచ్చని ప్రకటించింది సంచలనం సృష్టించారు.

మెట్రో రైల్లో పెప్పర్ స్ప్రే వల్ల మహిళలు ఆత్మరక్షణకు అవకాశం ఉంటుంది. ఆకతాయిలకు స్పాట్ లోనే బుద్ధి చెప్పొచ్చు. ఎవరైనా చేయి వేయటానికి ప్రయత్నిస్తే మంట రేపొచ్చు. యువతులు కూడా భరోసా ఉండొచ్చు. ఎవడైనా వెధవ వేషాలు వేస్తే స్పాట్ ట్రీట్ మెంట్ ఇవ్వొచ్చు.

మహిళలకు ఈ అవకాశం కల్పించింది మాత్రం హైదరాబాద్ మెట్రో కాదండీ.. బెంగళూరు. హైదరాబాద్ లో జరిగిన దిశ ఘటన తర్వాత బెంగళూరు మెట్రో అధికారులు, అక్కడి ప్రభుత్వం తీసుకున్న యాక్షన్ ఇది. ఇది చూసి హైదరాబాద్ అధికారులు ఫాలో అవుతారో లేదో చూడాలి. పెప్పర్ స్ప్రై రూపంలో మరోసారి లగడపాటి గుర్తుకొచ్చారు.. నువ్వు ఉన్నావయ్యా.. ఉన్నావ్…