డిజిటల్ రేటింగ్స్ : న్యూస్ 18 ప్రాపకాండ.. జ్యోతిని వెనక్కి నెట్టిన సాక్షి

174

డిజిటల్, సోషల్ మీడియాలో ఈనాడు, ఆంధ్రజ్యోతి ర్యాంకులు దిగజారాయి. పేపర్, ఛానల్, దేశవ్యాప్తంగా నెట్ వర్క్ ఉన్న ఈ పేపర్ అండ్ న్యూస్ ఛానల్స్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ వెనకబడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మిగతా వారితో పోల్చుకుంటే పాయింట్లలో భారీ వ్యత్యాసం ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది.

ComScore Ratings :
వెబ్ సైట్లకు రేటింగ్ ఇచ్చే కామ్ స్కోర్ సంస్థ తాజాగా రేటింగ్స్ విడుదల చేసింది. తెలుగులో ఇప్పుడు ఈ స్థానాన్ని న్యూస్ 18 ఆక్రమించింది. రెండో స్థానంలో ఈనాడు ఉన్నది. ఈ ఇద్దరి మధ్య వ్యత్యాసం 11 లక్షల హిట్స్ కావటం షాక్ కు గురి చేస్తోంది. ఇక్కడే అసలు విషయం ఏంటంటే.. ఈనాడు డాట్ నెట్, సాక్షి డాట్ కామ్, ఆంధ్రజ్యోతి డాట్ కామ్ అని మిగతా వెబ్ ఛానల్స్ ను స్పష్టంగా ఇచ్చిన వారు.. మొదటి స్థానంలో అని చెబుతున్న న్యూస్ 18ను మాత్రం న్యూస్ 18 తెలుగు అని మాత్రమే ఇచ్చారు. వెబ్ సైట్ బ్రౌజింగ్ నేమ్ ఇవ్వకపోవటం విశేషం.

ఇక ఆంధ్రజ్యోతి ఐదో స్థానంలో ఉంది. కేవలం 2.73 మినియన్ హిట్స్ మాత్రమే రాబట్టుకుంటోంది. మొదటి – ఐదో స్థానం మధ్య తేడా 5 మిలియన్ హిట్స్ కావటం విశేషం. మూడో స్థానంలో టైమ్స్ ఆఫ్ ఇండియా తెలుగు ఉంటే.. నాలుగో స్థానంలో సాక్షి ఉంది. సాక్షి – జ్యోతి మధ్య 5 మిలియన్ హిట్స్ తేడా ఉంది. డిజిటల్, సోషల్ మీడియాలో ఆంధ్రజ్యోతి ఐదో స్థానంలో ఉండటం షాకింగ్ కు గురి చేస్తోంది.

సహజంగా ప్రతిపక్షంలో ఉండే ఛానల్, పత్రిక వైపు చూస్తారు నెటిజన్స్. ఏం జరుగుతుందో అని. ఇక్కడ ఆశ్చర్యకరమైన మ్యాటర్ ఏంటంటే.. వైఎస్ బొమ్మతో, సీఎం జగన్ పత్రికగా ముద్రపడిన సాక్షి డిజిటల్ మీడియా.. ఆంధ్రజ్యోతి కంటే 50శాతం అధికంగా హిట్స్ రాబట్టుకోవటం ఆశ్చర్యంగా ఉంది. న్యూస్ 18 ప్రాపకాండ, ఏషియా నెట్ ప్రచారం ఢాంబికం అని తేలిపోయింది. వాళ్ల రేటింగ్స్ పై అనుమానాలు ఉన్నా.. తెలుగులో ప్రధాన పత్రికలు అయిన ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి రేటింగ్స్ మాత్రం ఆసక్తి రేపుతున్నాయి.

మొన్నటి వరకు మొదటి స్థానంలో ఉన్న జ్యోతి.. ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది. సహజంగానే ఈనాడు-జ్యోతి మధ్య ఒకటి, రెండు స్థానాలకు పోటీ ఉండేది. మూడో స్థానంలో సాక్షి ఉంటూ వస్తుంది. ఈసారి మాత్రం ఈనాడు ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చినా.. జ్యోతి థర్డ్ ప్లేస్ లో ఉంది. అయితే ఈ రెండింటి మధ్య వ్యూస్ తేడా భారీగా ఉండటం విశేషం. ఓ వైపు అమరావతి ఇష్యూ నడుస్తున్నా.. జ్యోతికి వ్యూస్ లక్షల్లో తగ్గటం చూస్తుంటే నెటిజన్ల విశ్వసనీయ కోల్పోతున్నట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న న్యూస్ 18 ర్యాంకింగ్స్ మాత్రం ఆ ఛానల్ పై అనుమానాలు రేకెత్తిస్తున్నా.. మిగతావి మాత్రం కరెక్టే అంటున్నారు డేటా అనలిస్టులు.