దిశ ఎన్ కౌంటర్ చెన్నకేశవులు తండ్రిని ఢీకొట్టిన కారు : చావుబతుకుల మధ్య కుర్మయ్య

326

దిశ నిందితుల ఎన్ కౌంటర్ లో చెన్నకేశవులు చనిపోయిన సంగతి తెలిసింది. అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. ఈ కార్యక్రమం పూర్తయిన రెండో రోజే చెన్నకేశవులు తండ్రి కుర్మయ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. బైక్ పై వెళుతున్న ఆయన్ను ఓ కారు ఢీకొట్టింది. హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం నిమ్స్ లో చికిత్స పొందుతున్న కూర్మయ్య ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.

నారాయణపేట జిల్లా జట్లేరు గ్రామంలో ఓ ఇన్నోవా కారు కుర్మయ్య వెళుతున్న బైక్ ను ఢీకొట్టింది. రాయచూరు వెళ్లే మార్గంలో జట్లేరు-గుడిగండ్ల మధ్య ఈ ప్రమాదం జరిగిందని కుర్మయ్య బంధువు చెబుతున్నారు. యాక్సిడెంట్ చేసిన కారును మక్తల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కూడా చెబుతున్నారు. తల, కుడి కాలుకు తీవ్రంగా గాయాలు అయ్యాయని.. చెవులు, నోటి నుంచి కూడా రక్తం వచ్చినట్లు చెబుతున్నారు బంధువులు.

చెన్నకేశవులు అంత్యక్రియలు ముగిసిన రోజుల వ్యవధిలోనే అతని తండ్రి కూడా రోడ్డు ప్రమాదంలో గాయపడటంలో చర్చనీయాంశం అయ్యింది.

కుర్మయ్యకు కావాల్సిన వైద్యసాయంతో పాటు ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు అతని కుటుంబ సభ్యులు.