మనిషివేనా రా నువ్వు : తప్పతాగి కూతురినే రేప్ చేసిన తండ్రి

89

నిర్భయ, దిశ ఘటనలు తర్వాత కూడా జనంలో మార్పు రావటం లేదు. మద్యం మత్తు వావి వరసలను మర్చిపోతుంది. మనుషులు పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. బుద్ధి, జ్ణానం రోజురోజుకు నశిస్తోంది. దీనికి ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్ రాష్ట్రం నీముచ్ అనే పట్టణంలో జరిగిన ఘటనే.

ఓ తండ్రి తన ఎనిమిదేళ్ల కూతురిపైనే అత్యాచారం చేశాడు. ఫుల్ గా మందుకొట్టి ఇంటికి వచ్చిన ఆ దరిద్రుడు.. ఇంట్లో నిద్రపోతున్న కూతురినే రేప్ చేశాడు. ఈ విషయాన్ని స్థానికులు చైల్డ్ హెల్ప్ లైన్ కు సమాచారం అందించారు. విచారణ చేసిన పోలీసులు.. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. బాలికపై అత్యాచారం జరిగినట్లు నిర్థారించారు డాక్టర్లు కూడా.

అత్యాచారం తర్వాత కూడా బాలికను ఎవరి కంట పడకుండా దాచటానికి తండ్రి ప్రయత్నించాడని ఆ జిల్లా ఎస్పీ రాకేశ్ మోహన్ శుక్లా వెల్లడించారు. తండ్రి కార్మికుడిగా పని చేస్తున్నాడని.. అతని లైంగిక నేరాల కింద, పిల్లల రక్షణ పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు వివరించారు ఎస్పీ. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక విచారణ బృందాన్ని కూడా నియమించారు జడ్జి.