ట్రాఫిక్ పోలీసుల సంచలన నిర్ణయం : హైదరాబాద్ లో ఫ్లై ఓవర్లు మూసివేత

57

డిసెంబర్ 31వ తేదీ రాత్రి నుంచి జనవరి 1వ తేదీ మధ్యాహ్నం వరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సంచలనం నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ఫ్లై ఓవర్లను మూసివేయాలని డిసైడ్ అయ్యారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 8 గంటల అన్ని ఫ్లై ఓవర్లను మూసివేసి.. ట్రాఫిక్ మళ్లించనున్నారు.

మొన్నటికి మొన్న గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పైనుంచి కారు పల్టీలు కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దాన్ని మూసివేశారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని.. 2019 డిసెంబర్ 31వ తేదీ రాత్రి 8 గంటల నుంచి అన్ని ఫ్లై ఓవర్లను మూసివేయాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తర్వాత రోజు అనగా జనవరి 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటల తర్వాతే ఓపెన్ చేయాలని డిసైడ్ అయ్యారు. పరిస్థితులు, ట్రాఫిక్ రద్దీ, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని మూసివేత, ఓపెన్ చేసే టైమింగ్స్ కొద్దిగా అటూ ఇటూ మారవచ్చు.

వాహనదారులకు ఈ విషయంలో ముందుగానే సమాచారం ఇస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ముందుజాగ్రత్తగా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కూడా సూచిస్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్ విషయంలో కఠినంగా ఉంటామని కూడా వార్నింగ్ ఇస్తున్నారు.