పోలీస్ వార్నింగ్ : న్యూఇయర్ అని లైట్ తీసుకుంటే.. మీ బతుకు బస్టాండే

60

జనవరి ఫస్ట్ అంటే డిసెంబర్ 31వ తేదీన సెలబ్రేషన్స్ జరుపుకోవటానికి సిటీ కుర్రకారు రెడీ అవుతుంటే.. పోలీసులు మాత్రం వారి వారి వ్యూహాలు కూడా సిద్ధం చేశారు. ఇష్టమొచ్చినట్లు తాగి రోడ్లపై తందనాలు ఆడొద్దని వార్నింగ్ ఇస్తున్నారు. అర్థరాత్రి వరకు తాగి గంతులు వేస్తే తాట తీస్తాం అంటున్నారు. స్పెషల్ పర్మిషన్ ఏమీ లేవని.. రెగ్యులర్ గా ఉండే టైమింగ్స్ మాత్రం ఉంటాయని పబ్స్, బార్లకు తేల్చిచెప్పారు. మామూలు రోజుల్లో అర్థరాత్రి 12 గంటల వరకు మాత్రమే పబ్స్ ఉంటాయి. డిసెంబర్ 31వ తేదీ కూడా అదే టైమింగ్ ఫాలో కావాలని చెబుతున్నారు పోలీసులు

హ్యాపీ న్యూయర్ చెప్పుకుని వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. ఆ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఉంటుందని.. ఇంకా ఎక్కువ స్పాట్స్ ఉంటాయని ఖరాఖండిగా తేల్చేశారు. జనవరి ఫస్ట్ అని లైట్ తీసుకుంటే.. కొత్త ఏడాది రోజే మీ జీవితం ఇత్తడి అవుతుందని గట్టిగానే చెబుతున్నారు ఖాకీలు. ఆ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే 10వేల రూపాయల జరిమానాతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని చెబుతున్నారు. మరీ ఎక్కువ తాగి ఉంటే బండిని సీజ్ చేయటంతోపాటు తీసుకెళ్లి బొక్కలో వేస్తామని కూడా అంటున్నారు.

వెధవ వేషాలు వేస్తే రోడ్డుపైనే తాట తీయటం ఖాయం అంటున్నారు. రెండు నెలలుగా రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలతో పోలీసుల తల బొప్పి కట్టింది. ఇప్పుడు ఏదైనా జరిగితే నేషనల్ మీడియా సైతం వెంటనే ఫోకస్ పెట్టేస్తుంది. జరగబోయే విపరీత పరిణామాలతో ముందుగానే అలర్ట్ అయ్యి.. ఈ ఆదేశాలు జారీ చేశారంట పోలీసులు. మందుబాబులు బీ కేర్ ఫుల్.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. జీవితానికి బ్యాడ్ గా స్టార్ట్ చేసుకోవద్దే…