టీడీపీని కాటెస్తున్న ఐడ్రీమ్ నాగరాజు

341

 ఐడ్రీమ్.. డిజిటల్ ఛానల్. ఇంటర్వ్యూలతో అదరగొడుతుంది. బీకాంలో ఫిజిక్స్ తో పొలిటికల్ ట్రెండ్ సృష్టించింది అనటంలో సందేహం లేదు. అలాంటి ఛానల్ కు ఇప్పుడు బ్లూ కలర్ వేస్తోంది టీడీపీ. పేపర్లు, టీవీల్లో సహజంగా ఉన్న ఎల్లో మీడియా Vs బ్లూ ఛానల్ యుద్ధం.. ఇప్పుడు డిజిటల్ ఛానల్ కు పాకింది. టీడీపీ నేతలు, కార్యకర్తలే కాకుండా అభిమానులు సైతం ఐ డ్రీమ్ బ్యాన్ అంటున్నారు. సోషల్ మీడియాలోనే నెగెటివ్ హ్యాష్ ట్యాగ్, కంటెంట్ తో విరుచుకుపడుతున్నారు.

నాగరాజుపై ఎందుకంత కోపం :

నాగరాజు ఇంటర్వ్యూకి పాపులారిటీపై ఎవరికీ అనుమానాలు లేవు. దీన్నే అతను క్యాష్ చేసుకుంటున్నాడు అంటోంది టీడీపీ గ్యాంగ్. ఎవరినైనా ఇంట‌ర్వ్యూ చేసే స‌మ‌యంలో పొర‌పాట్లు మాట్లాడినా.. ఆఫ్‌ది రికార్డులు చెప్పినా.. బ్రేక్ లో మాట్లాడుకునే పిచ్చాపాటి కబుర్లను ఎడిటింగ్ లో మిక్స్ చేసి టెలికాస్ట్ చేస్తాడనేది ప్రధాన ఆరోపణ. సంబంధం లేని ప్రశ్నలతో గందరగోళానికి గురి చేయటంతోపాటు.. పొరపాటున చెప్పే త‌ప్పుడు స‌మాధానాలను హైలెట్ చేస్తాడని చెబుతోంది టీడీపీ వర్గం.

ఎగ్జాంపుల్స్ కోకొల్లలు అంటున్న టీడీపీ వర్గం :

ఇటీవలే ఎర్ర‌న్నాయుడు కుమార్తె, ఎమ్మెల్యే భ‌వానీని ఇంట‌ర్య్వూ చేశారంట. వెట‌కారాలతో ఎక్కువ చేశారంట. టీడీపీ పార్టీనే దద్దమ్మగా క్రియేట్ చేశాడరంట. టీడీపీ నేతలు బి-గ్రేడ్ చిత్రీకరించే ప్రయత్నం చేశారంట. అదే టైంలో బైరెడ్డి సిద్ధార్ధరెడ్డిని మాత్రం హీరోగా క్రియేట్ చేసినట్లు చెబుతున్నారు. సిద్ధార్థరెడ్డిపై చాలా కేసులు ఉన్నాయని.. అయినా తోపు, తురుంఖాన్ గా ప్రజెంట్ చేశాడనేది వారి వాదన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జలీల్ ఖాన్ మంచోడుగా ఉన్నాడని.. టీడీపీ మారిన తర్వాత బీకాంలో పిజిక్స్ మేటర్ బయటకు తీసి రాజకీయ సమాధి చేశాడనేది వారి వాదన. ఓ మైనార్టీ వర్గానికి చెందిన నేత, లారీల వ్యాపారం చేసుకునే అతనికి చదువురాదని తెలిసి కూడా తన పైచాచిక ఆనందాన్ని పొందాడనేది టీడీపీ చెబుతున్న మాటలు.

వైసీపీలో ఉన్నప్పుడే ఇంటర్వ్యూ చేసి.. టీడీపీలోకి మారిన తర్వాత బీకాంలో ఫిజిక్స్ మేటర్ బయటకు తీశాడనేది నాగరాజుపై టీడీపీ వర్గాలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. నాగరాజు బాత్రూమ్స్ లో సీక్రెట్ కెమెరాలు పెడతాడా? ఇంతటితో ఆగని టీడీపీ సోషల్ మీడియా వింగ్.. ఐ డ్రీమ్ నాగరాజుపై మరో సంచలన ఆరోపణలు కూడా చేస్తోంది. కీలక నేతల ఆఫీసుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. బాత్రూమ్‌లో అమ్మాయిల చిత్రాలను తీసేవాడంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం షాక్ కు గురి చేస్తోంది. వీటిని పోర్న్ సైట్ల‌కు అమ్ముకునే వాడి టైపే నాగ‌రాజు అంటూ తీవ్రమైన పదజాలాలతో టీడీపీ సోషల్ మీడియా పొలిటికల్ వింగ్స్ లోనే పోస్టింగ్స్ దర్శనం ఇస్తున్నాయి.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సాక్షి స్పాన్స‌ర్‌ షిప్‌తో ఐడ్రీమ్ నడుస్తుందని.. వాళ్ల డ‌బ్బుతో నాగ‌రాజు టీడీపీ నేత‌ల‌ను టార్గెట్ చేస్తూ ఇంటర్వ్యూలను చేస్తున్నాడని చెప్పుకొస్తున్నారు. టీడీపీ నేతలు జాగ్రత్త : ఐ డ్రీమ్ మాయలో పడొద్దని, నాగరాజుతోపాటు ఆ ఛానల్ కు ఎవరూ ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని కూడా పిలుపునిస్తున్నారు టీడీపీ సోషల్ మీడియా నెటిజన్లు. టీడీపీ ఛానల్స్ లో ఈ విషయాలను పెద్ద ఎత్తున ప్రచారం చేయటం విశేషం. ఐ డ్రీమ్ చూడొద్దని.. వారి మాయలో పడొద్దని పిలుపునిస్తున్నారు.

ఐ డ్రీమ్ ఛానల్ బాయ్ కాట్ పిలుపు :

ఐ డ్రీమ్ ఛానల్ ను బాయ్ కాట్ చేయాలని టీడీపీ సోషల్ మీడియా పొలిటికల్ వింగ్ పిలుపునిస్తోంది. అన్ సబ్ స్క్రిప్షన్ చేయాలని కూడా మెసేజ్ లు ఇస్తున్నారు. ఓ డిజిటల్ ఛానల్ పై ఓ రాజకీయ పార్టీ యుద్ధం ప్రకటించటం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఐ డ్రీమ్ కలర్ మార్చుకుంటుందా లేదా అనేది తర్వాత సంగతి.. ముందు కంటెంట్ మారుస్తుందా లేదా అనేది పాయింట్ అయ్యింది.