జనసేనకి ఎమ్మెల్యే రాపాక రాజీనామా

6104

జనసేన పార్టీకి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవటాన్ని తీవ్రంగా విబేధించారు. పార్టీ సిద్దాంతానికి ఇది విరుద్ధం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు లేఖ రాశారు.

జనసేన పార్టీ విధానాలు, సిద్దాంతాలు వేరు. బీజేపీకి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. వైరుధ్యమైన పార్టీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకోవటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. విధానపరమైన మైత్రీ కాకుండా బేషరుతుగా మద్దతు ప్రకటించటాన్ని తప్పుబడుతున్నాను. జనసేన పార్టీ గుర్తుపై గెలిచిన నేను.. ఈ నిర్ణయంతో విబేధిస్తున్నాను. పార్టీలో కనీసం చర్చ కూడా జరగకుండా, కార్యకర్తలు, నేతల అభిప్రాయాలు తెలుసుకోకుండా బీజేపీతో పొత్తు పెట్టుకోవటాన్ని ఆక్షేపిస్తున్నాను.

జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నాను అంటూ పవన్ కల్యాణ్ కు లేఖ రాశారు రాపాక వరప్రసాదరావు.