ఇంజినీరింగ్ డ్రాపవుట్ స్టూడెంట్.. రాష్ట్రానికి సీఎం అయ్యాడు : కేసీఆర్ కు సన్నిహితుడు

329

జార్ఖండ్ లో జేఎంఎం, కాంగ్రెస్ కూటమి విజయం వెనక కీలక పాత్ర పోషించారు హేమంత్ సోరెన్. సీఎంగా ఆయన రెండో సారి పగ్గాలు చేపడుతున్నారు. తండ్రి శిబూసోరెన్ నుంచి రాజకీయ పాఠాలు నేర్చు కున్నారు. 44 ఏళ్ల హేమంత్ యువనేతగా పార్టీలో గట్టి పట్టు సాధించారు. గత అసెంబ్లీలో విపక్ష నేతగా కీలక పాత్ర పోషించారు. పార్టీని బలోపేతం చేయటంలో కీలకపాత్ర హేమంత్ దే.

యువ సీఎంగా జార్ఖండ్ ప్రజలు ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆదివాసీల నేతగా తన సత్తా చాటారు. భారరహిత అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జార్ఖండ్ ఐదో సీఎంగా పని చేశారు. 2013లోనే కాంగ్రెస్ మద్దతుతో జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు హేమంత్. ఇప్పుడు కూడా కాంగ్రెస్ మద్దతుతోనే సర్కార్ ఏర్పాటు చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు కూటమి లో ఆర్జేడీ కూడా చేరింది.

హేమంత్ సోరెన్ జార్ఖండ్ లోని రామ్ ఘర్ జిల్లాలో ఆగస్టు 10, 1975లో జన్మించారు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు. ఇంజనీరింగ్ కోర్సు లో జాయిన్ అయ్యారు. పూర్తి చేయలేకపోయారు. డ్రాప్ అవుట్ అయ్యారు హేమంత్ సోరెన్. గతంలో రాజ్యసభ ఎంపీగా కూడా పని చేశారు ఆదివాసీల భూమి హక్కుల కోసం ఉద్యమాన్ని నడిపారు.

సీఎం కేసీఆర్ తో సన్నిహిత సంబంధాలు :
తెలంగాణ సీఎం కేసీఆర్ తో హేమంత్ సోరెన్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. మద్యపాన నిషేధం కోసం జార్ఖండ్ లో ఉద్యమం నడిపారు హేమంత్ సోరెన్. ఆయనకు భార్య కల్పన, ఇద్దరు కుమారులు ఉన్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు. 2000 సంవత్సరంలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అయితే 2004 అసెంబ్లీ ఎన్నికల్లో డుంకా నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో మాత్రం గెలిచారు.