ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ లో కాశ్మీర్ పోలీసుల తనిఖీలు

117

తెలుగు మీడియా ఇదే ఇంట్రస్టింగ్ టాపిక్. ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ లో కాశ్మీర్ పోలీసులు తనిఖీలు చేశారు. కాశ్మీర్ నుంచి వచ్చిన ఖాకీలు.. వార్తలను పరిశీలించినట్లు తెలుస్తోంది. ఎందుకు వచ్చారు.. ఆ న్యూస్ ఛానల్ ఏం చేసింది.. రాష్ట్రంకానీ రాష్ట్రం.. వేల కిలోమీటర్ల నుంచి రావటం ఏంటనేది ఆసక్తిగా మారింది.

తెలుగు ఛానల్ మాత్రమే నడిపే ఆ సంస్థతో కాశ్మీర్ పోలీసులకు ఎందుకు అనుమానం వచ్చింది.. ఆ ఛానల్ చేసిన తప్పేంటీ.. కాశ్మీర్ పోలీసులు అనగానే సహజంగా మెదడులో మెదిలేది తీవ్రవాదులు, భారత్-పాకిస్తాన్ గొడవలు, దాడులు ఇలాంటి అంశాలే. మరి ఆ న్యూస్ ఛానల్ ఏం ప్రసారం చేసింది.. ఎందుకు కాశ్మీరీ పోలీసులు వచ్చారనేది స్పష్టంగా బయటకు రాకపోయినా.. తనిఖీలు చేసినట్లు ఆ ఛానల్ సిబ్బంది చెబుతున్నారు.

పాకిస్తాన్ కు సపోర్ట్ చేసే పరిస్థితి అయితే లేదు.. తీవ్రవాదానికి వత్తాసు పలకదు.. కాశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వండి వార్చే సీన్ కూడా లేదు.. అయినా కూడా ఆ ప్రముఖ న్యూస్ ఛానల్ ను వెతుక్కుంటూ కాశ్మీర్ పోలీసులు ఎందుకు వచ్చారనేది ఆసక్తిగా మారింది.
తెలుగు భాషే రాని కాశ్మీర్ పోలీసులు వేల కిలోమీటర్ల నుంచి వచ్చారంటే మేటర్ ఏదో సీరియస్సే అనుకుంటున్నారు.