కత్తి మహేష్ బతికే ఉన్నాడు..

186

కత్తి మహేష్ చనిపోయినట్లు.. ఆయనకు శ్రద్దాంజలి అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త, ఫొటో చక్కర్లు కొడుతుంది. ఇటీవల శ్రీరామచంద్రుడిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కొందరు నెటిజన్లు ఆయనపై దుమ్మెత్తిపోశారు. రాముడు మాంసం తినేవాడని.. రామాయణం అసలు లేదంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు కత్తి మహేష్. దీనిపై హిందూవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ కంప్లయింట్స్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ఆయన్ను ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. కత్తి మహేష్ చనిపోయాడు.. జననం – మరణం అని తేదీలు వేసి మరీ ఓ ఫొటో తయారు చేశారు. ఆయన శ్రద్ధాంజలి ఘటించారు.

వాస్తవానికి కత్తి మహేష్ బాగానే ఉన్నారు.. బాగా తింటున్నారు కూడా.. ఆయన పొట్ట కూడా ఏమీ తగ్గలేదు.. బాధతో ముఖం ఏమీ పీక్కుపోలేదు. నిక్షేపంగా ఉన్నాడు. హిందూవుల మనోభావాలు దెబ్బతీసిన ఆయనపై కొందరూ హిందూ భక్తులు ఈ విధమైన వార్తతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.

దీనిపై కత్తి కూడా స్పందించారు. వాళ్లు చంపితే చచ్చేవాడిని కాదంటున్నారు. చిరావుయువగా బతుకుతానని కూడా భరోసా ఇస్తున్నారు. ఇంకా ఇంకా ట్రోల్స్ చేసుకోవచ్చని కూడా సవాల్ విసురుతున్నారు.. అవునులే.. చిరావుయు అంటేనే సామెత గుర్తుకొస్తుంది సారూ…