తెలంగాణ రోడ్లపై కేశినేని ట్రావెల్స్ పరుగులు

1255
kesineni travels to launch on telangana roads

తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఏపీలోని ట్రాన్ పోర్ట్ వ్యాపారులకు కలిసివస్తోంది. ముఖ్యంగా కేశినేని ట్రావెల్స్ పంట పండిందనే టాక్ వస్తోంది. రెండేళ్ల క్రితం కేశినేని ట్రావెల్స్ ను ఒక్కసారిగా క్లోజ్ చేశారు. సుమారు 300 బస్ సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆ తర్వాత కొన్ని బస్సులను మిగతా ట్రావెల్స్ వారు లీజ్ కు తీసుకున్నట్లు సమాచారం. కేశినేని ట్రావెల్స్ ఆర్థిక వ్యవహారాలు మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. కొన్ని కోట్ల రూపాయలు ఇప్పటికీ బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలకు బాకీ ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ట్రావెల్స్ ఓనర్ ఓ పార్టీ ఎంపీ కావటంతో వ్యవహారం బయటకు రాలేదనేది బెజవాడు ప్రజలు, ఇతర వ్యాపారులు చెప్పుకునే మాట. బస్సు సర్వీసులు నిలిపివేసిన తర్వాత వాటిని లీజుకు ఇవ్వటం, కొన్నింటిని అమ్మటం ద్వారా వచ్చిన డబ్బుతో కొంత అప్పులు తీర్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ 150 బస్సుల తర్వాత తన ఆధీనంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఇప్పుడు కేశినేని ట్రావెల్స్ కు బంపరాఫర్ తగిలింది అంట. తన దగ్గర ఉన్న బస్సులన్నింటినీ తెలంగాణ రోడ్లపైకి ఎక్కించబోతున్నారంట. ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ ఆర్టీసీకి భారీగా బస్సుల కొరత ఉంది. దీన్ని అవకాశంగా తీసుకుని తన దగ్గర ఉన్న బస్సులను తెలంగాణ హైవేలపై పరుగులు పెట్టించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం వెయ్యి బస్సుల వరకు తిప్పటానికి నిర్ణయించింది. పనిలో పనిగా తెలంగాణ అసోసియేషన్ తరపునే తన బస్సులను కూడా నడిపించటానికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది.

కేశినేని ట్రావెల్స్ బస్సులు చాలా బాగుంటాయి. కంఫర్ట్ గా ఉంటాయి. లగ్జరీకి కూడా చిరునామా. ఇలాంటి బస్సులను హైదరాబాద్ నుంచి భద్రాచలం, వరంగల్, కరీంనగర్, శ్రీశైలం, వేములవాడ వంటి రద్దీ రూట్లలో తిప్పాలని డిసైడ్ అయ్యారంట. తెలంగాణ ఆర్టీసీ సమ్మెతో ఏపీలో మూతపడిన కేశినేని ట్రావెల్స్ మళ్లీ పురుడుపోసుకోవటం విశేషమే కదా…