నిర్భయ నిందితులను డిసెంబర్ 16న ఉరి తీస్తారా?

149

దేశవ్యాప్తంగా అత్యాచారం, హత్య తీవ్రతకు నిదర్శనంగా మారిన నిర్భయ కేసులో నిందితులకు ఉరిశిక్ష ఖరారు అయ్యింది. క్షమాభిక్ష పిటీషన్ ను రాష్ట్రపతి భవన్ తిరస్కరించింది. దీంతో ఇక వీరిని ఉరి తీయటమే మిగిలింది. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

డిసెంబర్ 16వ తేదీ ఉదయం 5 గంటలకు నలుగురు నిందితులను ఉరి తీయాలని ముహూర్తం ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఉరి కంభానికి వేలాడ దీసే తాళ్లు కూడా సిద్ధం చేశారు. బీహార్ బాక్సైట్ జైలు నుంచి తయారు చేసిన 10 తాళ్లు ఇప్పటికే తీహార్ జైలుకు వచ్చాయంట. అన్ని సిద్ధం చేసిన అధికారులు ఇప్పుడు ఉరి తీసే తలారీ వేటలో ఉన్నారు.

దేశవ్యాప్తంగా ఒకే ఒక్క తలారీ ఉన్నారు. ముంబైలో ఉన్న అతన్ని ప్రత్యేక ఆదేశాలతో తీహార్ జైలుకి తరలించనున్నారు. ఆ ప్రక్రియ కూడా ప్రారంభం అయినట్లు వార్తలు వస్తున్నాయి. అన్ని సిద్ధం చేసిన అధికారులు.. నిర్భయ ఘటన జరిగిన డిసెంబర్ 16వ తేదీనే నలుగురు నిందితులకు ఉరి శిక్ష అమలు చేయనున్నట్లు సమాచారం. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ విషయాలను మాత్రం తీహార్ జైలు అధికారులు కానీ, హోంశాఖ కానీ ధృవీకరించటం లేదు.

దిశ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వపైనా ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.