మహిళల నినాదంతో మగాళ్లు షాక్ : నో సెక్స్.. నో పెళ్లి.. నో పిల్లలు.. నో డేటింగ్

248

ప్రపంచవ్యాప్తంగా మహిళలు కొత్త నినాదం ఎత్తుకుంటున్నారు. జీవితంపై విరక్తో ఏమోకానీ.. నాలుగు సూత్రాల పథకాన్ని అమల్లోకి తెస్తున్నారు. ప్రతిదానికీ ప్రత్యామ్నాయం ఉన్నట్లే.. మాకు మా అవసరాలు ఏంటో తెలుసు.. మగాళ్ల కోసం బలి పశువులం కాలేం అంటున్నారు లేడీస్.

ఈ నాలుగు సూత్రాలు ఏంటో తెలుసా :
నో డేటింగ్.. నో సెక్స్.. నో మ్యారేజ్.. నో పిల్లలు. ఏంటీ మగాళ్లు షాక్ అయ్యారు కదా.. ఇది వాస్తవం. సౌత్ కొరియాలో పుట్టిన ఈ ఉద్యమం ఇప్పుడు ఆ దేశాన్నే షేక్ చేస్తోంది. డేటింగ్ గేటింగ్ ఏమీ లేదు.. మా సంగతి మేం చూసుకుంటాం అంటున్నారు. చచ్చేదాకా ఈ సూత్రాలను వదిలిపెట్టం అని ప్రతిజ్ణలు చేస్తున్నారు. డేటింగ్ లేకపోతే లేకపోయింది.. పెళ్లి లేకపోతే పర్వాలేదు.. సెక్స్ లేకుండా ఎలా అమ్మా అని పదే పదే అడుగుతున్నారు అక్కడి కుర్రోళ్లు.

సెక్స్ అంటే మగాళ్లతోనే చేయాలా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. తుత్తికి ఎన్నో మార్గాలు ఉన్నాయి.. మా తుత్తి ఏదో మేం చూసుకుంటాం అంటూ మగాళ్లపైనే విచుకుపడుతున్నారు. పిల్లలు లేకపోతే దేశం భవిష్యత్ ఏంటీ అని ప్రభుత్వం గగ్గోలు పెడుతుంది. పెళ్లి చేసుకోకపోతే చేసుకోకపోయావ్.. సహజీవనంతో పిల్లలను కని మాకు అప్పగిస్తే మేమే చూసుకుంటాం అని ప్రభుత్వం అంటుందంట.

దీనికి నో అంటున్నారు సౌత్ కొరియా అమ్మాయిలు. కావాలంటే వీర్యం ఇస్తాం.. కుండలో పెట్టుకుని పిల్లలను పుట్టించుకోండి అంటున్నారు. నో మ్యారేజ్ ఉమెన్ అంటూ ఉద్యమం నెత్తికెత్తుకున్నారు. అలా స్టార్ట్ చేశారో లేదో ఇలా 4వేల మంది లేడీస్ ఉద్యమంలో చేరిపోయారు. పెళ్లి, పిల్లలు అవసరం అని పదేళ్ల క్రితం 47శాతం మహిళలు చెబితే.. ఇప్పుడు ఆ శాతం 22.4కి పడిపోయింది. పదేళ్లలో సగం మంది అమ్మాయిలు మారిపోయారు.

మా సంగతి ఏంటీ అంటూ కుర్రోళ్లు గగ్గోలు పెడుతున్నారు..