గ్రేట్ రాబరీ ఇన్ ఇండియా : బ్యాంక్ EMI కట్టటానికి ఉల్లిపాయలు దోపిడీ

116

కష్టాల్లో ఉన్నాడు.. అప్పులు కూడా ముట్టటం లేదు.. మన కష్టాలు బ్యాంకు వాళ్లకు తెలియదు కదా.. అందుకే EMI కట్టాలని ఒకటే టెన్షన్ పెడుతున్నారు. ఇక లాభం లేదనుకున్నాడు ఆ కుర్రోడు. ఏదో ఒకటి చేసి బ్యాంక్ అప్పు కట్టేయాలని డిసైడ్ అయ్యాడు. దీనికి ఉల్లిపాయలనే ఎంచుకున్నాడు.

సంతోష్ అనే యువకుడు బ్యాంక్ అప్పుతో లారీ కొన్నాడు. కొన్నాళ్లుగా వ్యాపారం సరిగా లేకపోవటంతో అప్పులు పెరిగాయి. ఇదే టైంలో కర్నాటక నుంచి చెన్నైకి ఓ ఆర్డర్ వచ్చింది. ఉల్లిపాయల లోడ్ తీసుకెళ్లాలని. అంతే ఎగిరి గంతేశాడు. తన డ్రైవర్ తో కలిసి తొమ్మిది లక్షల రూపాయల విలువైన 81 బస్తాల ఉల్లిపాయలను లారీ ఎక్కించాడు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత తన ప్లాన్ అమలు చేశాడు. తవెరకరే పోలీస్ స్టేషన్ ఏరియాకు రాగానే రోడ్డు పక్కన ఉన్న గుంటలోకి కావాలనే లారీ తీసుకెళ్లాడు. యాక్సిడెంట్ జరిగినట్లు చిత్రీకరించాడు. లారీలోని 40 బస్తాల ఉల్లిని మరో వాహనంలో తరలించాడు. లోకల్ మార్కెట్ లో విక్రయించాడు. 4 లక్షల రూపాయలు సొమ్ము చేసుకున్నాడు.

లారీ యాక్సిడెంట్ పై పోలీసులకు అనుమానం వచ్చింది. ఈ ప్రాంతంలో ఇలా లారీ ప్రమాదానికి గురి కావటం చిత్రంగా ఉందే అని ఆనుమానించారు. విచారణ చేశారు. విషయం బయటపడింది.
గతంలో పెట్రోల్, డీజిల్, బంగారం, డబ్బు ఇలా దోపిడీలు జరిగేవి. ఇప్పుడు ఉల్లిపాయల దొంగతనం జరగటంపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ యువకుడి ప్లాన్ విని షాక్ అయ్యారు పోలీసులు. ఉల్లిపాయలు అయితే దోపిడీ చేశాడు పోలీసులు చిక్కకుండా మరో ఐడియా వేయలేకపోయాడు.. బ్యాంక్ ఈఎంఐ కట్టటం ఏమోగానీ ప్రస్తుతం మనోడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. ఉల్లి కోస్తేనే కాదు.. దొంగిలించినా కన్నీళ్లు వస్తాయనేది మనోడు కొత్తగా నిరూపించాడు అంటున్నారు నెటిజన్లు..