బీజేపీలో జనసేన విలీనం : పవన్ ఢిల్లీ టూర్ వెనక రహస్యం ఇదే : లాబీయింగ్ చేసింది వైసీపీ ఎంపీ!

245

అందరూ అనుకున్నదే కాకపోతే కొంచెం ఆలస్యం.. మరింత క్లారిటీగా వచ్చేసింది. బీజేపీతో టచ్ లోనే ఉన్నానని జనసేన అధినేత స్వయంగా ప్రకటించటం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చేదా అని పవన్ కల్యాణ్ ప్రకటించటం వెనక అసలు రహస్యం బయటపడింది.

పవన్ ఢిల్లీ టూర్ వెనక జరిగింది ఇదే :
కొన్ని రోజుల క్రితం పవన్ కల్యాణ్ డిల్లీ వెళ్లారు. రెండు రోజులు ఎవరికీ కనిపించకుండా.. ఎక్కడ ఉన్నాడో కూడా తెలియకుండా రహస్యంగా టూర్ సాగించారు. ఆ టూర్ లోనే బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమమంత్రి అమిత్ షాతో రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ చేసిన లేటెస్ట్ వ్యాఖ్యలే ఇందుకు బలాన్ని ఇస్తున్నాయి.

వైసీపీ ఎంపీ లాబీయింగ్ చేశారా :
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు లాబీయింగ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ కు ఢిల్లీలో ఆశ్రయం ఇచ్చింది కూడా ఈయనే. అందుకే అప్పుడు సీఎం జగన్ పిలిచి మరీ క్లాస్ పీకినట్లు వార్తలు వచ్చాయి. నేటి పవన్ వ్యాఖ్యలు చూస్తుంటే.. మాజీ బీజేపీ నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు లాబీయింగ్ చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ అగ్రనేతలతో ఉన్న పరిచయాలతో అమిత్ షా – పవన్ కల్యాణ్ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తోంది. అప్పటి రహస్య పర్యటన వెనక రహస్యాన్ని తన మాటల్లోనే బయటపెట్టుకున్నారంటే.. త్వరలోనే బీజేపీలో జనసేన విలీనం ఖాయం అని స్పష్టం అవుతుంది.