పవన్ యూటర్న్.. కర్నూలులో హైకోర్టుకు మద్దతు.. అమరావతి రైతులు షాక్

251

అమరావతి రైతులకు పవన్ కల్యాణ్ షాక్ ఇచ్చారు. కర్నూలులో హైకోర్టు ఎందుకు పెట్టరంటూ నిలదీశారు. హైకోర్టును కర్నూలు పట్టణంలో పెట్టాలని బహిరంగ ప్రకటన చేశారు. ఒకే రాజధాని.. అది అమరావతి అని నిన్నటి వరకు రైతులతో కలిసి అమరావతి గ్రామాల్లో పర్యటించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు యూటర్న్ తీసుకోవటం ఉద్యమం చేస్తున్న రైతులకు షాకింగ్ కు గురి చేసింది. కర్నూలులో హైకోర్టు మాత్రమే కాదని.. రాయలసీమ అంతా అభివృద్ధి చెందాలని.. అన్ని పరిశ్రమలు కూడా రావాలని ఆకాంక్షించారు.

రాయలసీమకు ఉద్యోగాలు రావాలని ఆకాంక్షించారు. కేవలం హైకోర్టు మాత్రమే వస్తే సరిపోదని.. ఇంకా ఇంకా పరిశ్రమలు రావాలని కోరారు. సీమలో నిరుద్యోగం అన్న పదమే వినిపించకోడదు అన్నారు.

కర్నూలు వెళ్లి మరీ హైకోర్టును కర్నూలులో పెట్టడాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నట్లు ప్రకటన చేశారు. విషయం తెలిసిన వెంటనే అమరావతి రైతులు భగ్గుమన్నారు. అమరావతి వచ్చి ఒకే రాజధాని అన్న పవన్ కల్యాణ్.. కర్నూలు వెళ్లి హైకోర్టుకు మద్దతు ప్రకటించటం ఏంటని నిలదీస్తున్నారు. జనసేన పార్టీ వైఖరిపై అమరావతి గ్రామాల్లోని దీక్ష శిబిరాల్లో చర్చనీయాంశం అయ్యింది.