కేసీఆర్ చెబితేనే.. స్వామిగౌడ్ హాస్పిటల్లో చేరారు: ఉత్తమ్

62

కేసీఆర్ చెబితేనే.. స్వామిగౌడ్ హాస్పిటల్లో చేరారు: ఉత్తమ్

ముఖ్యమంత్రి కేసీఆర్ చెబితేనే తాను సరోజిని ఆస్పత్రిలో చేరారని మండలి చైర్మన్ స్వామి గౌడ్ స్వయంగా చెప్పారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సస్పెన్షన్ అనంతరం కాంగ్రెస్ నేతలు.. అసెంబ్లీ వెల్ లో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఒక పక్కకూర్చున్న వ్యక్తి హెడ్ ఫోన్ విసిరేస్తే.. మరో పక్క ఉన్న వ్యక్తికి ఎలా దెబ్బతగులుతుందని అనుమానం వ్యక్తం చేశారు. స్పీకర్ మధుషూదనా చారి పక్షపాత వైఖరిగా వ్యవహరిస్తున్నారన్నారు. స్పీకర్ వ్యవహార శైలి.. అనుమానాస్పదంగా ఉందన్నారు. ఇలాంటి పదవికి అప్రదిష్ట తెచ్చే స్పీకర్ ను తామెప్పుడూ చూడలేదన్నారు. సభలో 50 మంది పోలీసులను పెట్టి తమపై దాడి చేశారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజా స్వామ్యాన్ని కూని చేస్తోందన్నారు. ప్రస్తుతం పార్లమెంట్ కేసీఆర్ కుమార్తె.. ప్లకార్డులు పట్టుకుని.. స్పీకర్ ఎదుట నిరసన తెలుపుతోందని.. ఇక్కడ అసెంబ్లీలో చేస్తే తాము చేస్తే సస్పెండ్ చేస్తారా.. మాకో న్యాయం.. మీ కూతురికో న్యాయమా అంటూ ప్రశ్నించారు. ప్రతి పక్షాన్ని తొక్కేసి.. కేసీఆర్ లాభ పడాలని చూస్తున్నారన్నారు.

అయితే మమ్మల్నందరినీ బయటకు పంపేసి.. బడ్జెట్ ను ఆమోదింప చేసుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని అంతకముందు మాట్లాడిన జానా రెడ్డి పేర్కొన్నారు. నిన్న విషయంపై నిర్ణయం తీసుకునే అధికారం శాసన సభ, మండలి చైర్మన్, స్పీకర్ కు లేదని జీవన్ రెడ్డి తెలిపారు. ఉభయ సభలను ఉద్దేశించిన మాట్లాడిన గవర్నర్ మాత్రమే సమావేశాలకు అధిపతి అని ఆయనకు మాత్రమే నిర్ణయం తీసుకునే అధికారం ఉందన్నారు.